మ్యాప్‌లో పీఓకే కనపడేసరికి.. పాకిస్థాన్‌కి పాపం మైండ్ బ్లాక్

భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య త్వరలో జరగబోయే టీ20 సిరీస్ కోసం ఏసీబీ ఒక ప్రచార వీడియోను తయారుచేసింది.

Update: 2026-09-08 09:00 GMT

క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు.. బ్యాట్, బాల్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం మిగతా దేశాల పని. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పని మాత్రం కాస్త వేరు. ప్రపంచంలో ఎక్కడ ఏ మ్యాప్ కనిపించినా.. భూతద్దం పట్టుకుని కూర్చుని "అయ్యో.. మా ఆక్రమిత ప్రాంతాన్ని భారత్‌లో కలిపేశారే" అని గుండెలు బాదుకోవడమే వారి ముఖ్య విధుల జాబితాలో చేరిపోయినట్లుంది. తాజాగా అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) చేసిన ఒక్క చిన్న ప్రమోషనల్ వీడియోతో పీసీబీకి నిద్రలేకుండా పోయింది.

భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య త్వరలో జరగబోయే టీ20 సిరీస్ కోసం ఏసీబీ ఒక ప్రచార వీడియోను తయారుచేసింది. అందులో భారత్ మ్యాప్‌ను చూపించే క్రమంలో.. అసలైన భారత్‌కు చెందిన పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), గిల్గిట్-బాల్టిస్థాన్‌లను భారత్‌లోనే కలిపి చూపించారు. ఇక అంతే ఆ దృశ్యం చూడగానే పాకిస్థాన్ బోర్డుకు మ్యాచ్ ఓడిపోయినంత ప్యామిలీ ఫీలింగ్ వచ్చేసింది. "అయ్యయ్యో.. ఇదేం అన్యాయం.. క్రీడల్లో రాజకీయాలా?" అంటూ మీడియా ముందుకు వచ్చి లబోదిబోమనడం మొదలెట్టారు.

పాకిస్థాన్ మీడియా అయితే ఈ మ్యాప్ వివాదాన్ని ఏదో మూడో ప్రపంచ యుద్ధం స్థాయిలో కవర్ చేస్తోంది. "అసలు అఫ్గాన్ బోర్డు కావాలనే చేసిందా? లేక గ్రాఫిక్స్ డిజైనర్ కంటికి పాకిస్థాన్ ఆక్రమించిన భాగాలు సరిగ్గా ఆనుకోలేదా?" అంటూ రకరకాల పరిశోధనలు మొదలుపెట్టేశారు. ఆఖరికి ఈ తీవ్రమైన "మ్యాప్ నేరానికి" గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేసేందుకు పాక్ పెద్దలు కాగితాలు పట్టుకుని సిద్ధమవుతున్నారట. ఐసీసీకి వెళ్లి ఏమని ఫిర్యాదు చేస్తారో మరి? "వాళ్ళు నిజమైన మ్యాప్ చూపించారు, మాకు కోపం వచ్చింది" అని చెప్తారేమో..

అయినా అఫ్గానిస్థాన్ బోర్డు చేసిందేముంది? ఇండియా అధికారిక మ్యాప్ ఎలా ఉంటుందో.. ప్రపంచానికి ఏది నిజమో దాన్నే చూపించింది. నిజం నిలకడగా తెలుస్తుందంటే ఇదేనేమో.. మైదానంలో సిక్సర్లు కొట్టడం పక్కన పెట్టి ప్రమోషనల్ వీడియోల్లో మ్యాప్‌లు సరి చూసుకోవడానికే సరిపోతుంటే.. ఇక మ్యాచ్‌లు గెలవడం ఎలాగో పాక్ జట్టే ఆలోచించుకోవాలి. సెప్టెంబర్ 13 నుంచి జరగబోయే ఈ సిరీస్‌లో బంతి ఏమో కానీ ఈ మ్యాప్ వివాదం మాత్రం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు గట్టి బౌన్సర్‌లా తగిలిందని స్పోర్ట్స్ సర్కిల్స్ లో నవ్వుకుంటున్నారు.



Full View


Tags:    

Similar News