• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడీ విత్ రాహుల్...ఎంత...

మోడీ విత్ రాహుల్...ఎంత బావుందో !

| రాజకీయ నాయకులు అంటే ప్రజా సేవకులు. ప్రజల కోసం వారు వాదులాడుకోవడం మంచి విషయమే. అలాగే అభివృద్ధి కోసం డైలాగ్ వార్ నడపడమూ ఇంకా మంచి విషయమే.

By - Satya P
Update: 2026-04-12 04:00 GMT

రాజకీయ నాయకులు అంటే ప్రజా సేవకులు. ప్రజల కోసం వారు వాదులాడుకోవడం మంచి విషయమే. అలాగే అభివృద్ధి కోసం డైలాగ్ వార్ నడపడమూ ఇంకా మంచి విషయమే. కానీ రాజకీయంగా ప్రత్యర్ధులు కంటే కూడా శత్రువులుగా మారి ముఖాలు సైతం చూడకుండా ఉండే పరిస్థితి అయితే దారుణం. అలాంటిది వద్దు అనే అంతా అంటారు. ప్రజా స్వామ్యంలో అధికార విపక్షాలు రెండూ కలవాలి. ప్రజల మన్ననలతో పవర్ అందుకున్న వారు డ్రైవింగ్ ఫోర్స్ గా ఉంటే అపొజిషన్ లో ఉన్న వారు అడ్వైజర్స్ గా ఉంటారు. ఇలా నిర్మాణాత్మకంగా కలసి మెలసి ఉండడమే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ.

ఎన్నికల వేడి వేళ :

ఒక వైపు దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల వేడి వేసవి ఎండలను మించి ఉంది. అందులో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు ముగిసాయి. ఇక మిగిలిన రెండూ కూడా కీలకమైనవే. ఈ సమయంలో ఢిల్లీలో జరిగిన మహాత్మా జ్యోతీరావు ఫూలే 200వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇద్దరూ తారసపడ్డారు. మోడీ అందరినీ పలకరిస్తూ రాహుల్ గాంధీకు అభివాదం చేశారు. రాహుల్ సైతం ప్రధానికి నమస్కారం పెట్టారు. ఆ తరువాత మోడీ స్వయంగా రాహుల్ వద్దకు వచ్చారు. ఇద్దరూ కొంతసేపు ముచ్చటించుకున్నారు. ఇది అక్కడ ఉన్న అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

వైరల్ అయిన వైనం :

అంతే కాదు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వీడియో తెగ వైరల్ అయింది. మోడీ విత్ రాహుల్ ఎంత బాగుందో అని అంతా అనుకోవడం జరిగింది. ఇది కదా అసలైన ప్రజాస్వామ్యం అని అంతా ఆలోచించేలా ఈ భేటీ ఉంది అంటున్నారు. నిజానికి చూస్తే ప్రజా ప్రతినిధులు ఈ విధంగా కలిసి మాట్లాడుకోవడం ఈ దేశానికి కొత్త కాదు, గతంలో జరిగినదే. ఒక యువ ఎంపీగా వాజ్ పేయి ఉన్నపుడు అప్పటికే బలమైన ప్రధానిగా రెండోమారు దేశానికి నాయకత్వం వహిస్తున్న పండిట్ నెహ్రూ వాజ్ పేయి చేసే విమర్శలను సానుకూలంగా స్వీకరించడం సభా సాక్షిగా ఆయన లేవనెత్తిన పాయింట్లలో సహేతుకతని ప్రస్తావించడం వంటివి జరిగాయి.

ప్రజలకే మేలు :

రాజకీయాల అంతిమ లక్ష్యం ప్రజలకు మేలు చేయడం. భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. కానీ చివరిని అంతా కూర్చుని ఒక అభిప్రాయానికి రావడం ద్వారా ప్రజలకు మేలు చేయడమే ప్రజాస్వామిక మూల సూత్రం. కానీ ఈ రోజు అది కొరవడుతోంది. దేశంలో అనేక చోట్ల వింత పోకడలు కనిపిస్తున్నాయి. విపక్షం అయితే గొంతు నొక్కుతున్నారని అంటోంది. అధికార పక్షం అయితే విపక్షం విమర్శలను తట్టుకోలేకపోతోంది. అయితే ఈ రకమైన వాతావరణం మారాల్సి ఉందని ప్రజాస్వామ్య ప్రియులు అంతా గట్టిగా కోరుకుంటున్నారు. ఏపీ లాంటి చోట్ల కూడా అధికార విపక్షాలు కలసి మెలసి ఉండాలని అంతా ఆశిస్తున్నారు. అపుడే ప్రజా స్వామ్య స్పూర్తి నిలబడుతుందని అంటున్నారు.

Tags:    
  • modi 
  • rahulgandhi 
  • indiapolitics 
  • democracy 
  • politicalleaders 
  • bjp 
  • congress 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS