• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రెండు సంతకాలకు రూ.300...

రెండు సంతకాలకు రూ.300 కోట్లు వస్తాయని చెప్పారట

By - Tupaki Desk
Update: 2021-10-23 05:30 GMT
దేశంలో చాలామంది గవర్నర్లు ఉన్నారు. కానీ.. తాజాగా మేఘాలయ గవర్నర్ గా వ్యవహరిస్తున్న సత్యపాల్ మాలిక్ మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఏదో ఒక అంశంలో ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు రాజకీయ రగడకు తెర తీసేలా ఉందన్న మాట వినిపిస్తోంది. గతంలో జమ్ముకశ్మీర్ కు గవర్నర్ గా వ్యవహరించిన ఆయన.. తాజాగా నాటి సంగతుల్ని చెప్పారు. ఈ సందర్భంగా సంచలన నిజాన్ని ఆయన నోటి నుంచి బయటకు వచ్చింది.  

తాను జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరిస్తున్నప్పుడు తన టేబుల్ మీదకు రెండు ఫైళ్లు వచ్చాయని.. అవి దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త.. సంఘ్ పరివార్ తో అనుబంధం ఉన్న వ్యక్తికి చెందిన రెండు సంస్థలని చెప్పారు. కాకపోతే.. అందులో ఏదో మతలబు ఉందని తనకు తెలిసిందన్నారు. అయితే.. ఆ రెండు ఫైళ్లను క్లియర్ చేస్తే రూ.300 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారన్నారు. రెండు సంతకాలకు రూ.300కోట్లు ఇస్తామన్న ఆఫర్ ను తన సెక్రటరీ చెప్పారని.. తాను మాత్రం ఆ ఫైళ్లను రిజెక్టు చేసినట్లు చెప్పారు. తన జీవితంలో అవినీతి పనులు చేయలేదన్నారు.

తనకు వచ్చిన డీల్ గురించి ప్రధానమంత్రి మోడీకి తెలిపినట్లు చెప్పారు. తాను ఫైళ్లను రిజెక్టు చేసినందుకు ఒత్తిళ్లు వస్తాయని కొందరు చెబితే.. గవర్నర్ పదవి నుంచి తప్పుకోవటానికైనా తాను సిద్ధమని చెప్పినట్లు చెప్పారు. ప్రధాని మోడీ తన నిర్ణయాన్ని సమర్థించినట్లు వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 2018 ఆగస్టు 21న జమ్మూకశ్మీర్ గవర్నర్ గా వ్యవహరిస్తే.. ఏడాది తర్వాత ఆయన్ను గోవాకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయన మేఘాలయ గవర్నర్ గా పని చేస్తున్నారు. గవర్నర్ కే ఆఫర్ ఇచ్చిన ఆ బడా కంపెనీ ఏమిటో బయటకు చెబితే బాగుండేది కదా సత్యపాల్ జీ?






Full View


Full ViewFull View
Tags:    
  • Satyapal Malik 
  • Satyapal Malik comments 
  • bjp party 
  • Governor Satyapal Malik 
  • Satyapal Malik about 300 crores 

Similar News

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

Copyright @2026

Powered by Blink CMS