సీబీఐపై బాబు నిషేధం.. సెటైర్లే సెటైర్లు..
సీబీఐ.. ఇప్పుడు ఎవరు ఎన్ని ఉపమానాలు ఇచ్చినా.. దేశ అత్యున్నత సంస్థ కేంద్ర చేతిలో కీలుబొమ్మ అని మన ఏపీ సీఎం చంద్రబాబు తేల్చేశారు. అందుకే సీబీఐని ఏపీలో నిషేధించారు. తన పీకల మీదకు వచ్చే కేసులను సీబీఐకి అప్పగించి పీచమణిపించే రోజులు వస్తాయనో లేక మరేదైనా కారణమో కానీ చంద్రబాబు ఏపీలో సీబీఐని నిషేధించడం వెనుక బోలెడు చర్చ జరుగుతోంది.
నిజానికి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ దేశంలో ఎక్కడైనా దాడి చేసే హక్కు కలిగింది. దీన్ని చంద్రబాబు నిషేధించడం అంత ఈజీ కాదు.. హైకోర్టుల్లో బాబు ఈ విషయంలో చుక్కెదురు కావడం ఖాయం. కానీ కేంద్రంలోని మోడీ సీబీఐతో తనను టార్గెట్ చేయాలనుకున్నాడని బాబు ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. అందుకే ఇలా నిషేధం విధించి తన పవర్ ను నిలుపుకోవాలని బాబు చూస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే సీబీఐ నిషేధించడంపై సోషల్ మీడియాలో సైటెర్లు పడుతున్నాయి. సీబీఐ దాడులకు భయపడి పారిపోయిన విజయ్ మాల్యా - నీరవ్ మోదీలు ఇప్పుడు నిర్భయంగా ఏపీకి రావచ్చని.. ఏపీలో సీబీఐని బాబు నిషేధించడంతో ఇక్కడకి వచ్చి హాయిగా కాలం గడపవచ్చని సెటైర్లు వేస్తున్నారు. పనిలో పనిగా సీబీఐని నిషేధించినట్టే స్విస్ బ్యాంకుల తరహాలోనే అమరావతిలో ఓ నల్లధనం దాచుకునే బ్యాంకును బాబు సొంతంగా ఏర్పాటు చేస్తే సరి అంటున్నారు. కమీషన్ చెల్లించి దాచుకోవాలని బాబు ప్రకటన ఇస్తే బాగుంటుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బాబు దయ వల్ల దేశంలోని నల్లడబ్బు విదేశాలకు పోకుండా అమరావతిలోనే ఉంచిన ఘనత బాబు సొంతమవుతుందంటున్నారు.. నెటిజన్ల కోరికపై బాబు దీనిపై ఆలోచించాలి మరి..