పది రోజుల్లో బయటకు రానున్న శశికళ!

Update: 2020-10-23 09:10 GMT
అక్రమాస్తుల కేసులో గత కొన్ని రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ మరో పది రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ  చిన్నమ్మ న్యాయవాది‌ రాజా చెందూర్‌ పాండియన్‌  వెల్లడించారు. శశికళ విడుదల అయ్యేందుకు జరిమానా మొత్తం రూ.10 కోట్ల 10 వేలు సిద్ధం చేశామని చెప్పారు. అయితే తన న్యాయవాది రాజాచెందూర్‌ పాండియన్‌ కు శశికళ ఆదివారం ఓ లేఖ కూడా రాశారు. ఆ లేఖలోని అంశాల ఆధారంగానే ఈ విషయాన్ని చెబుతున్నానని న్యాయవాది తెలిపారు.

కాగా, కర్ణాటక జైళ్ల నిబంధనల ప్రకారం, శిక్ష అనుభవించే వారికి నెలలో మూడు రోజులు సత్పవర్తన పరిధిలో ఉంటుందని, ఇలా శశికళకు 129 రోజుల శిక్షా కాలం తగ్గుతుందని , ప్రస్తుతం కర్ణాటకలోని కోర్టులకు దసరా పండగ సెలవులు కాగా, ఈనెల 26న కోర్టులు తిరిగి ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. ఆ తర్వాత శశికళ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని గట్టిగా చెప్పారు. కాగా, 2017 ఫిబ్రవరిలో అక్రమాస్తుల కేసులో శశికళను అరెస్టు చేశారు. తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరు కోర్టు వేసిన నాలుగేళ్ల జైలు శిక్షను సుప్రీం కోర్టు కూడా సముఖత వ్యక్తం చేసింది. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టింది. కానీ ఆ పార్టీ నుంచి పళనిస్వామి బృందం ఆమెను తొలగించారు.
Tags:    

Similar News