• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సజ్జలకే సాక్షి షాక్

సజ్జలకే సాక్షి షాక్

By - Tupaki Desk
Update: 2021-07-25 08:30 GMT
సజ్జల రామకృష్ణారెడ్డి..పరిచయం అవసరం లేని అధికారపార్టీ ముఖ్యులు. గడచిన 12 ఏళ్ళుగా వైసీపీలో కానీ ఇపుడు ప్రభుత్వంలో కానీ  సజ్జల పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. అందుకనే 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించగానే సజ్జలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఇటు ప్రభుత్వ సలహదారుగా అటు వైసీపీ ప్రధాన కార్యదర్శిగా సజ్జల డబుల్ యాక్షన్ బాగానే పోషిస్తున్నారు.

అలాంటి సజ్జలకు సాక్షి మీడియా ఒక్కసారిగా షాకిచ్చింది. సలహాదారులు రాజకీయాలు మాట్లాడటం ఏమిటి ? ప్రెస్ మీట్లు పెట్టడం ఏమిటనే విషయంపై కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. గతంలో ఎప్పుడైనా సలహాదారులు మీడియా సమావేశాలు పెట్టి రాజకీయాలు మాట్లాడారా అంటు కోర్టు ఓ విచిత్రమైన ప్రశ్న వేసింది. ఈ నేపధ్యంలోనే శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన సజ్జలను సాక్షి మీడియా కేవలం వైసీపీ ప్రధాన కార్యదర్శి అని మాత్రమే ప్రస్తావించింది.

శుక్రవారం వరకు సజ్జల గురించి ఏమి రాసినా ప్రభుత్వ సలహాదారు అని రాసిన సాక్షి మీడియా ఒక్కసారిగా ప్రధాన కార్యదర్శి అని మాత్రమే సరిపెట్టడం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి సలహాదారులు రాజకీయాలు మాట్లాడకూడదని, ప్రెస్ మీట్లు పెట్టకూడదని ఎక్కడా లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో సలహాదారుగా పనిచేసిన కేవీపీ రామచంద్రరావు కేవలం హెలికాప్టర్ ప్రమాదం జరిగినపుడు మాత్రమే మీడియా సమావేశం పెట్టారని చెప్పింది.

కోర్టుకు తెలీని విషయం ఏమిటంటే మొదటినుండి కేవీపీ మీడియాకు దూరం. మీడియా మిత్రులతో పిచ్చాపాటి ఎంతసేపైనా మాట్లాడుతారు కానీ సమావేశాలు మాత్రం పెట్టరు. ఆ మీడియాలో కొంతమందితో మాత్రమే కేవీపీ సన్నిహితంగా ఉంటారంతే. ఇక చంద్రబాబునాయుడు హయాంలోని సలహాదారుల్లో పరకాల ప్రభాకర్, కుటుంబరావులు ఎన్ని వందల మీడియా సమావేశాలు పెట్టారో లేక్కేలేదు.

అంతేకాకుండా పరకాలైతే మహానాడులో పాల్గొని ఏకంగా ఓ తీర్మానాన్నే ప్రవేశపెట్టినట్లు వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. మంత్రివర్గ సమావేశాల్లో కూడా పరకాల కూర్చున్న విషయం కోర్టుకు తెలీదేమో.  కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు తీవ్రంగా ఆక్షేపించిన తర్వాత క్యాబినెట్ సమావేశాలకు పరకాలను చంద్రబాబు దూరంగా ఉంచారు. సలహాదారులు మీడియా సమావేశాలు పెట్టడం అన్నది ముఖ్యమంత్రి ఇష్టంమీదుంటుంది. సీఎం ప్రెస్ మీట్లు పెట్టమంటే పెడతారు లేకపోతే మానేస్తారంతే. అంతేకానీ ప్రత్యేకించి నియమ నిబంధనలేమీ లేవు.
Tags:    
  • Sajjala Ramakrishna Reddy 
  • Sajjala Ramakrishna Reddy ycp party 
  • andhra pradesh 
  • Government Advisor 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS