• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సజ్జల సత్యాలు : అవును...

సజ్జల సత్యాలు : అవును కదా... నిజమే కదా...?

By - Tupaki Desk
Update: 2022-05-25 15:44 GMT
ఆయన ఇంటిపేరులో మంచితనం ఉంది. ఆయనే సజ్జనుడు అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి. ఆయన సత్యమే చెబుతాను అని మీడియా ముందుకు వచ్చి  ఎపుడూ తనకు నిజాలు అనిపించినవి అన్నీ చెబుతారు. అయితే ఆయన అందులో లాజిక్కులను మిస్ అయినవి బోలెడు ఉంటే ఉండొచ్చు కాక రాజకీయ మేధావిగా సజ్జలను మాటలను అలా వింటూంటారు అంతా.

ఇక సజ్జల లేటెస్ట్ గా ధర్మాగ్రహంతో మీడియా ముందుకు వచ్చారు. ఆ ఆవేశంతో చాలా సత్యాలు చెప్పారు. అందులో ఒక పాయింట్ ఏంటి అంటే కోనసీమ అల్లర్ల విషయంలో వైసీపీ వారే వైసీపీ మీద దాడులు చేయించుకున్నారు అన్న విపక్షాలకు కౌంటర్. మా సొంత పార్టీ వారి మీద మేము ఎందుకు దాడులు చేయించుకుంటాం. ఇది జరిగే పనేనా. చెప్పండి అంటూ సజ్జల చెప్పుకొచ్చారు.

అలా చేయించుకుంటే మాకు వచ్చే లాభం ఏంటి అని కూడా ఆయన తిరిగి విపక్షాలను అడిగారు. మా మంత్రి, మా ఎమ్మెల్యే, వారి మీద మేమే ఎందుకు దాడులకు దిగుతామండీ అని కూడా ఆయన చెప్పుకున్నారు. నిజమే. ఇది సత్యమైన సత్యమే కదా. ఇక చూస్తే  ఆరోపణలు అన్నీ కోరస్ మాదిరిగా ఒకేలా ఉన్నాయని అంటూ టీడీపీ జనసేనలను కలిపి సజ్జల సార్ విమర్శలు చేశారు.

అంతే కాదు, విపక్షాల మాటలు, వారి విమర్శలు చూస్తూంటే వారే ఈ దాడులు చేయించారని అర్ధమవుతోందని మరో సత్యాన్ని కనుగొని అది కూడా మీడియాకు చెప్పేశారు. అడ్డగోలు విమర్శలు చేస్తూ మా మీద బురద జల్లాలని చూస్తున్న విపక్షాల తీరు మీద ఆయన మండిపడ్డారు.

అంతే కాదు, దాడులు అంతా పక్కా ప్లాన్ తోనే జరిగాయని ఆయన అన్నారు. ఈ విషయంలో ఒక్కొక్కరూ బయటపడుతున్నారని, ఎవరినీ తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని పరమ సత్యాన్ని చెప్పారు. మొత్తానికి సజ్జల చెప్పిన వాటిలో చాలా సత్యాలు ఉన్నాయి. మరి అసలు సత్యం మాత్రం ఇంకా పోలీసులు చెప్పాలన్నది సజ్జల వారు గుర్తించాలి.

అవతల వారు అధికార పార్టీ మీద ఆరోపణలు చేస్తే సజ్జల వారు వారి మీద చేస్తున్నారు. మరి దాడులకు పాల్పడింది ఎవరు అన్నది పోలీసులతో విచారణ జరిపిస్తే వారు ఏ పార్టీ రంగూ రూపూ అన్నది కనుక తేల్చి జనం ముందు పెడితే అపుడు సజ్జల వారు చెప్పిన సత్యాలకు మరింతగా విలువ పెరుగుంది. ఇంతకీ కొసమెరుపు ఏంటి అంటే సజ్జల వారికి ఇది తెలియని సత్యం.

వైసీపీ వాళ్ళు దాడులు తమ సొంత పార్టీ వారి మీద చేయించుకుని ఉండకపోతే మరీ మంచిది కానీ. ఈ రోజున దేశంలో రాజకీయం అలాగే ఏడిచింది మరి. అందుకే ఈ ఆరోపణలు వస్తున్నాయి. నిజాన్ని నిగ్గు తీసి సత్యాన్ని బయటకు లాగి సజ్జల వారు అసలు దోషులను తెర ముందుకు తెస్తే కోనసీమ రావణకాష్టం వెనక ఉన్న అసలైన రావణులు ఎవరో తెలుస్తుంది. మొత్తానికి  సజ్జల వారిది సత్యాగ్రహం. ధర్మాగ్రహం గానే చూడాలి.
Tags:    
  • Sajjala Ramakrishna Reddy 
  • YSRCP 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS