• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ వద్దన్న షర్మిల...

జగన్ వద్దన్న షర్మిల వినలేదు: సజ్జల సంచలన వ్యాఖ్యలు

By - Tupaki Desk
Update: 2021-07-08 09:57 GMT
తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన వైఎస్ షర్మిల విషయంలో మరోసారి సీఎం జగన్ స్పందన ఏంటో బయటకు వచ్చింది. షర్మిలకు వైసీపీతో సంబంధం లేదని.. సీఎం జగన్ సన్నిహితుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్న వేళ సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో షర్మిల రాజకీయ భవిష్యత్తును చూసుకున్నారని..  షర్మిల తెలంగాణలో రాజకీయం చేస్తా అన్నప్పుడే సీఎం జగన్ వద్దని వారించాడని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దనేది తమ పార్టీ విధానమన్న సజ్జల కుండబద్దలు కొట్టారు.

ఏపీ, తెలంగాణ అన్నప్పుడు.. తెలంగాణ ప్రయోజనాలకే కట్టుబడి ఉంటానని షర్మిల ఇప్పటికే ప్రకటించారని సజ్జల తెలిపారు.  పార్టీలో షర్మిలను ఎదగనివ్వకపోవడం అనేది లేదని.. పార్టీలో పదవులు ఇవ్వలేదని ఆమె ఇంకో పార్టీ పెట్టారని అనుకోవట్లేదన్నారు.

ఏపీలో జరుగుతున్న అభివృద్ధి తెలంగాణలో ఎందుకు జరగకూడదనే ఆమె ఆలోచిస్తున్నారని తెలిపారు.తెలంగాణలో వైసీపీని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఏపీ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనే జగన్‌ భావిస్తున్నట్లు సజ్జల తెలిపారు. అందుకే షర్మిలను కూడా కొత్త పార్టీ వద్దని కోరినట్లు ఆయన వెల్లడించారు .

షర్మిలకు వైసీపీ తరుఫున ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఎలాంటి సహకారం ఉండదని స్పష్టం చేశారు.  షర్మిల పార్టీతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని సజ్జల కుండబద్దలు కొట్టారు. అందుకే షర్మిలను కూడా కొత్త పార్టీ వద్దని కోరినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణపై సీఎం జగన్‌తో పాటు వైసీపీ కూడా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నాయని సజ్జల తెలిపారు. అందుకే అక్కడ పార్టీని ముందుకు తీసుకెళ్లడం లేదన్నారు. షర్మిలపై సజ్జల చేసిన వ్యాఖ్యలు పూర్తి క్లారిటీగా ఉండటంతో పాటు సంచలనాత్మకంగా ఉన్నాయి.
Tags:    
  • Sajjala Ramakrishna Reddy 
  • YSRCP 
  • YS Sharmila 
  • Latest News 
  • Political News 
  • Telangana 

Similar News

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

Copyright @2026

Powered by Blink CMS