బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత విషాదం
బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అప్పటి వరకు అపజయం ఎరుగని దిగ్గజ బాక్సర్ ఓడిపోయాడు. ఆ ఓటమితోనే ప్రాణాలు సైతం వదిలేసిన వైనం ప్రపంచ బాక్సింగ్ ప్రియులను కలిచివేసింది.
140 పౌండ్ల డబ్బులతో అత్యంత ఖరీదైన అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీ. అమెరికాలోని మేరీలాండ్ లో శుక్రవారం రాత్రి నిర్వహించారు. రష్యాకు చెందిన బాక్సర్ మాక్సిమ్ దదషేవ్(28) తిరుగులేని బాక్సర్. వరుసగా 13 బౌట్లలో విజయం సాధించాడు. కానీ 14వ బౌట్ అతడి ప్రాణాల మీదకు తెచ్చింది.
మాగ్జిమ్ 14వ బౌట్ లో ప్రత్యర్థి సుబ్రియేల్ మథియాస్ తో తలపడ్డాడు. ఈ పోరులో సుబ్రియేల్ రెచ్చిపోయాడు. ఏకంగా 319 పంచులు విసిరాడు. తలకు బలంగా తాకడంతో మెదడులో రక్తస్రావం జరిగిపోయింది. 11వ రౌండ్ లోనే కుప్పకూలడంతో సుబ్రియేల్ ను విజేతగా రిఫరీ ప్రకటించాడు.
ఇక కుప్పకూలిన దదషేవ్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా కోమాలోకి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల అనంతరం బుధవారం రాత్రి చనిపోయాడు. దదషేవ్ కు భార్య, 2 ఏళ్ల కుమారుడున్నాడు. ప్రాణాలు పోయేలా కొట్టిన సుబ్రియేల్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇలా బాక్సింగ్ రేసులో చనిపోవడం ప్రపంచ బాక్సింగ్ చరిత్రలోనే విషాధ సంఘటనగా మిగిలిపోయింది. భారీ డబ్బుల కోసం బరిలోకి దిగి ప్రాణాలు పోగొట్టుకున్న దదషేవ్ సంఘటన విషాధాన్ని నింపింది.