రెండో వ్యాక్సిన్ రెడీ చేస్తున్న రష్యా.. ఇదైనా సేఫ్‌గా చేస్తారా?
కరోనా ఎఫెక్ట్ ఏమోకానీ.. వ్యాక్సిన్లు పేరుతో రష్యా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇప్పటికే స్పుత్నిక్-వి పేరుతో ఓ వ్యాక్సిన్‌ను విడుదల చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ అగ్రదేశం తాజాగా మరో వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిసారిగా గత ఆగస్టులో స్పుత్నిక్ వీ పేరుతో కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసి పంపిణీ ప్రారంభించింది. అయితే ఈ వ్యాక్సిన్ భద్రతపై పలువురు నిపుణులు, వివిధ దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. ట్రయల్స్ పూర్తిచేయకుండానే వ్యాక్సిన్ పంపిణీ చేశారంటూ ఆరోపణలు వినిపించాయి. అయినప్పటికీ ఆ దేశం వెనక్కితగ్గలేదు. అయితే తాజాగా మరో వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. అక్టోబర్-15న తన రెండో కరోనా వ్యాక్సిన్ “ఎపివాక్” రిజిస్టర్ చేయనుంది. ఈ వ్యాక్సిన్ ను వెక్టార్ స్టేట్ రీసెర్ట్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ అభివృద్ధి చేసినట్టు ఆ దేశం ప్రకటించింది.
ఇటీవలే ఈ వ్యాక్సిన్‌కు మొదటిదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో రెండవ దశ హ్యూమన్ ట్రయిల్స్ నిర్వహించనున్నారు. రెండోదశలో మొత్తం 30వేల మంది వాలంటీర్లకు టీకాలు వేస్తారు. ఈ వ్యాక్సిన్‌కు జులై నెలలోనే వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ కు రష్యా ఆరోగ్యమంత్రిత్వశాఖ అనుమతిచ్చింది. గత నెలలో ట్రయిల్స్ లో పాల్గొన్న దాదాపు 20మంది వాలంటీర్లు డిశ్చార్జ్ అయ్యారు.క్లినికల్ ట్రయిల్స్ పై రష్యా చీఫ్ శానిటరీ డాక్టర్ అన్నా పొపొవా మాట్లాడుతూ.. హ్యూమన్ ట్రయిల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారంతా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. వారిలో యాంటీబాడీస్ కూడా ఉత్పత్తి అయ్యాయి. అయితే ఈసారైనా రష్యా సేఫ్‌కు వ్యాక్సిన్ తీసుకురావలని ప్రజలు కోరుతున్నారు.