నిబంధ‌న‌లు ప్ర‌జ‌ల‌కేనా సీఎస్ సార్‌?!

Update: 2021-12-18 14:39 GMT
ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ఏ నిబంధ‌న అయినా.. ఏ నియ‌మ‌మైనా.. ప్ర‌జ‌ల‌కేనా? ప్ర‌భుత్వ అధికారుల‌కు.. పాల‌కుల‌కు ప‌ట్ట‌దా? ఆయా నిబంధ‌న‌లు కేవ‌లం ప్ర‌జ‌ల‌కోస‌మే అమ‌లు చేస్తారా? వారు పాటించ‌రా? ఇ దీ.. ఇప్పుడు నెటిజ‌న్లు సంధిస్తున్న ప్ర‌శ్న‌. ఎందుకంటే.. తాజాగా ఒక ఫొటో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తు న వైర‌ల్ అవుతోంది. అది ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(సీఎస్) అదికారిక వాహ‌నం. అయితే.. ఈ వాహ నానికి ర‌వాణా శాఖ కేటాయించిన నెంబ‌రు ప్లేట్‌.. ఏమాత్రం నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

సామాన్య ప్ర‌జ‌లు ఏ చిన్న త‌ప్పు చేసినా.. వంద‌ల్లో వేల‌ల్లో ఫైన్‌లు విధించే అధికారులు.. తాము మాత్రం నిబంధ‌న‌లుపాటించాల్సిన అవ‌స‌రం లేద‌నే విధంగా ఉన్నార‌ని.. ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌.. నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ‌.. వినియోగిస్తున్న వాహ‌నానికి అమ‌ర్చిన నెంబ‌ర్‌ప్లేట్‌పై ఉన్న నంబ‌ర్లు.. ర‌వాణా శాఖ నిబంధ‌న‌లకు విరుద్ధంగా ఉన్నాయి. దీంతో దీనిని ఫొటో తీసిన వ్య‌క్తి.. సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది.

వాస్త‌వానికి కేంద్రం, సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కు ప్ర‌తి వాహ‌నానికి హైసెక్యూరిటీ నెంబ‌రు ప్లేట్‌ను అమ‌రుస్తున్నారు. కానీ, సీఎస్ వాహనానికి హైసెక్యూరిటీ నెంబ‌ర్ ప్లేట్ లేదు. అదేవిధంగా వాహ‌నానికి కేటాయించిన వాస్త‌వ నెంబ‌ర్ AP39KQ0001. అయితే.. సీఎస్ వాహ‌నానికి మ‌ధ్య‌లో ఉన్న మూడు సున్నాలూ తీసేసి.. కేవ‌లం 1ని మాత్ర‌మే ఉంచారు. అది కూడా మిగిలిన అక్ష‌రాలు చిన్న‌విగా.. 1 మాత్ర‌మే పెద్ద‌దిగా ఉంచారు. నిబంధ‌నల మేర‌కు హైసెక్యూరిటీ నెంబ‌రు ప్లేట్‌లో అక్ష‌రాలు.. నెంబ‌ర్లు.. ఒకే సైజులో ఒకే ఫాంట్‌తో ఉండాలి.

కానీ.. ఇవ‌న్నీ.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే.. త‌మ‌కు మాత్రం కాద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కామెం ట్లు వ‌స్తున్నాయి. ఇక‌, మాస్కు ధ‌రించే విష‌యంలోనూ.. ప్ర‌జ‌ల‌కు చెబుతున్న నీతుల‌కు.. అధికారులు పాటిస్తున్న‌దానికీ వ్య‌త్యాసం ఉండ‌డంతో దీనిపైనా నెటిజ‌న్లు కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా.. అధికారులు.. మార‌తారో .. లేదో చూడాలి.
Tags:    

Similar News