రోజా క్వ‌శ్చ‌న్‌!..ఎన్ ఐఏ అంబే బాబుకెందుకు భ‌యం?

Update: 2019-01-05 13:19 GMT
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కేసు ద‌ర్యాప్తులో చోటుచేసుకున్న కీల‌క ప‌రిణామంపై ఇప్పుడు స‌ర్వాత్రా చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఎయిర్ పోర్టు ఆవ‌ర‌ణలో జ‌రిగే ఎలాంటి నేరాల‌నైనా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో విచార‌ణ చేయించాల‌న్న అంశంపై జ‌గ‌న్ కోర్టును ఆశ్ర‌యించ‌గా... త‌మ పోలీసుల‌తో చేయిస్తున్న ద‌ర్యాప్తున‌కు జ‌గ‌న్ స‌హ‌క‌రించ‌డం లేద‌ని చంద్ర‌బాబు స‌ర్కారు ఆరోపిస్తోంది. ఈ క్ర‌మంలో మొన్న ఈ కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌ల‌ను జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ)కు అప్ప‌గిస్తూ ఏపీ హైకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం మేర‌కు ఇప్ప‌టికే కేసు న‌మోదు చేసిన ఎన్ ఐఏ... కేసు పూర్తి వివ‌రాల‌ను సేక‌రించే ప‌నిలో ప‌డింది. అయితే చంద్ర‌బాబు స‌ర్కారు ఆధ్వ‌ర్యంలోని రాష్ట్ర పోలీసు శాఖ ఈ కేసు వివ‌రాల‌ను అంత ఈజీగా ఎన్ ఐఏకు అందించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు.

ఈ క్ర‌మంలో నేటి మ‌ధ్యాహ్నం మీడియా ముందుకు వ‌చ్చిన వైసీపీ ఫైర్ బ్రాండ్ - చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా... చంద్ర‌బాబు స‌ర్కారుపై త‌న‌దైన శైలిలో ఫైర‌య్యారు. కేసుల ద‌ర్యాప్తు విష‌యంలో చంద్ర‌బాబుకు ఓ విధానం - ఇత‌రుల‌కు మ‌రో ఉంద‌న్న విధంగా టీడీపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లపై ఆమె మండిప‌డ్డారు. అయినా జ‌గ‌న్‌ పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కేసును హైకోర్టు ఎన్ ఐఏకు అప్ప‌గిస్తే... చంద్ర‌బాబు ఎందుకు ఉలిక్కిప‌డుతున్నార‌ని ఆమె ప్ర‌శ్నించారు. అస‌లు జ‌గ‌న్ కేసు ద‌ర్యాప్తుపై చంద్ర‌బాబు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారో చెప్పాలని కూడా ఆమె నిల‌దీశారు. జ‌గ‌న్ కేసు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు అప్ప‌గిస్తేనే చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నారంటే... ఈ హ‌త్యాయ‌త్నం వెనుక చంద్ర‌బాబు పాత్ర ఉంద‌నే అనుకోవాల్సి వ‌స్తుంద‌ని సంచ‌ల‌న కామెంట్ చేసిన రోజా... కేంద్రంలో ఆధీనంలోని ఎయిర్‌ పోర్టులో జ‌గ‌న్‌ ను చంపేస్తే ఆ కేసు కేంద్రంపై వెళ్లిపోతుంద‌న్న భావ‌న‌తోనే విశాఖ ఎయిర్ పోర్టులో ఈ దాడి చేయించార‌ని ఆరోపించారు. మొత్తంగా జ‌గ‌న్ పై జ‌రిగిన దాడికి సూత్ర‌ధారి చంద్ర‌బాబేన‌న్న కోణంలో ఆమె ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ కేసు ద‌ర్యాప్తును త‌మ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల జోక్యం అవ‌స‌రం లేద‌ని చంద్ర‌బాబు చెబుతున్నారని, అయితే రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో జ‌రుగుతున్న ద‌ర్యాప్తులో భాగంగా ఇప్ప‌టిదాకా నిందితుడిని ప‌నిలో పెట్టుకున్న ఎయిర్ పోర్ట్ క్యాంటీన్ ఓన‌ర్‌, టీడీపీ నేత‌ను ఎందుకు విచారించ‌లేద‌ని రోజా నిల‌దీశారు. ఇక నిన్న కాకినాడ‌లో ఓ మ‌హిళ‌ను ఫినిష్ చేస్తానంటూ చంద్ర‌బాబు వీరంగ‌మాడిన వైనంపై స్పందించిన రోజా... రాష్ట్రంలో అమ‌లు అవుతున్న‌ది భార‌త రాజ్యాంగ‌మా?  లేదంటే నారా రాజ్యాంగ‌మా? అని సెటైర్ సంధించారు. త‌న‌ను ప్ర‌శ్నించేందుకు వ‌చ్చిన మ‌హిళ‌ను ఏకంగా ఫినిష్ చేసేస్తాన‌ని చంద్ర‌బాబు బెదిరిస్తున్నారంటే... జ‌గ‌న్‌ను అంత‌మొందించేందుకు చంద్ర‌బాబు ప‌థ‌కం ప‌న్న‌లేదంటే న‌మ్మేదెలా? అని కూడా రోజా లాజిక్ తీశారు. మొత్తంగా రాష్ట్రంలో చంద్ర‌బాబు రౌడీ పాల‌న‌ను సాగిస్తున్నార‌ని కూడా ఆమె ధ్వ‌జ‌మెత్తారు. మ‌రి రోజా కౌంట‌ర్ల‌కు చంద్ర‌బాబు శిబిరం ఎలాంటి స‌మాధానం ఇస్తుందో చూడాలి.


Full View

Tags:    

Similar News