జగన్ బాహుబలి...బాబు భల్లాలదేవ
మైక్ పట్టుకుంటే ఆకట్టుకునే ప్రసంగం చేయడంతో పాటుగా అలరించే కామెంట్లు చేసే వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు - నగరి శాసన సభ్యురాలు ఆర్ కే రోజా మరోమారు అదే రీతిలో వైసీపీ శ్రేణులను ఆకట్టుకున్నారు. మాజీ మంత్రి బాలినేని అధ్యక్షతన ఒంగోలులో వైసీపీ ప్రకాశం జిల్లా ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న రోజా ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరువందల హామీలు ఇచ్చి ఏఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. పైగా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిచి రాబోయే కాలంలో 30 సంవత్సరాలపాటు జగన్ పాలన రాష్ట్రంలో ఉంటుందని రోజా జోస్యం చెప్పారు. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు.
బాహుబలి సినిమాలో బాహుబలిని చూసి బల్లాలదేవుడు ఎలా భయపడతాడో అదేవిధంగా జగన్ అనే బాహుబలిని చూసి చంద్రబాబు గుండెల్లో వణుకుపుడుతోందని రోజా సూత్రీకరించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రోజా తెలిపారు. రైతులు - యువత - మహిళలు సహా అన్నివర్గాల ప్రజలు పరిష్కారం అవుతాయని అన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే జిల్లాలోని 12 అసెంబ్లీ స్ధానాలు - రెండు ఎంపీ స్థానాలు వైసీపీ గెలుపొందటం ఖాయమనిపిస్తుందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి పరిపాలన, అక్రమార్కులకు వంత పాడుతున్న తీరు వంటివి ప్రజలు గమనిస్తున్నారని రోజా తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/