బాబును రోజా వ‌దిలిపెట్టేది లేద‌ట‌!

Update: 2017-08-07 10:29 GMT
వైసీపీ ఫైర్ బ్రాండ్‌, చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా... టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడితో పాటు ఆయ‌న కుమారుడు - మంత్రి నారా లోకేశ్ - టీడీపీ నేత‌ల‌ను ఏమాత్రం వ‌దిలిపెట్టేటట్టుగా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే... ఏ చిన్న అవ‌కాశం చిక్కినా టీడీపీ నేత‌ల‌ను ఉతికి ఆరేస్తున్న రోజా రాఖీ ప‌ర్వ దినాన్ని పుర‌స్క‌రించుకుని కూడా చంద్రబాబుపై ఘాటు కామెంట్లు చేశారు. అస‌లు రోజా చేస్తున్న కామెంట్ల‌ను క‌నీసం కౌంట‌ర్లు కూడా ఇవ్వ‌లేని స్థితిలో బాబు అండ్ కో ఉండ‌గా, చంద్ర‌బాబు అస‌లు నోరు విప్పేందుకు కూడా సాహ‌సం చేయ‌డం లేదు. మొన్న‌టికి మొన్న చంద్ర‌బాబు - లోకేశ్ వ్య‌వ‌హార స‌ర‌ళిపై నిప్పులు చెరిగిన రోజా... నంద్యాల‌లో అధికార పార్టీ నేత‌ల‌కు ఎదురొడ్డి మ‌రీ నిలిచారు.

తాజాగా రాఖీ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌జానీకానికి, ప్ర‌త్యేకించి మ‌హిళా లోకానికి ర‌క్షా బంద‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆ మ‌రుక్ష‌ణ‌మే మీడియా ముందుకు వ‌చ్చిన రోజా... రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపే అర్హత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని తేల్చి పారేశారు. ఇందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా రోజా ఊటంకించ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అంశ‌మే. టీడీపీకి చెందిన ఓ మ‌హిళా నాయ‌కురాలు త‌న‌కు ప్రాణ‌హానీ ఉంద‌ని నేరుగా చంద్ర‌బాబుకు మొర‌పెట్టుకుంద‌ట‌. అయినా ఆ మ‌హిళ‌కు టీడీపీ నుంచి గానీ, చంద్ర‌బాబు నుంచి గానీ ఎలాంటి హామీ ల‌భించ‌క‌పోగా, క‌నీసం ర‌క్ష‌ణ కూడా ద‌క్క‌లేద‌ట‌. ఇదే అంశాన్ని ప్ర‌స్తావించిన రోజా... సొంత పార్టీకి చెందిన మ‌హిళా నేత‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేని చంద్ర‌బాబు... మ‌హిళా లోకానికి ర‌క్షా బంద‌న్ శుభాకాంక్ష‌లు ఎలా చెబుతార‌ని ప్ర‌శ్నించారు.

సొంత పార్టీ మ‌హిళా నేత‌ను కాపాడుకోలేక‌పోయిన చంద్ర‌బాబును ఏమ‌నాలంటూ ప్ర‌శ్నించిన రోజా... తానే ఆన్స‌ర్ ఇస్తూ... అలాంటి వ్య‌క్తిని చేత‌గాని ద‌ద్ద‌మ్మ అంటార‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలో చంద్రబాబు కూడా చేత‌గాని దద్ద‌మ్మ కిందే లెక్క అంటూ ఆమె త‌న‌దైన స్టైల్లో సెటైర్ సంధించారు. ఇప్ప‌టికే నారా లోకేశ్ ను ప‌ప్పు అంటూ నెటిజ‌న్లు పిలుస్తున్న అంశాన్ని మొన్నామ‌ధ్య ప్ర‌స్తావించిన రోజా... లోకేశ్ నిజంగానే ప‌ప్పు అని వ్యాఖ్యానించి క‌ల‌కలం రేపారు. తాజాగా చంద్ర‌బాబును చేత‌గాని ద‌ద్ద‌మ్మ‌లా అభివ‌ర్ణించిన రోజా... టీడీపీ అధినేత‌పై న సెటైర్ల‌ను పీక్స్ కు తీసుకెళ్లిపోయారు. ఇక చంద్రబాబు కేబినెట్‌పై మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేసిన రోజా... చంద్ర‌బాబు కేబినెట్ లోని మంత్రులంద‌రినీ కంత్రీలుగా అభివ‌ర్ణించారు. టీడీపీ ఎమ్మెల్యేల‌ను ఆమె కాల‌కేయుళ్లుగా పేర్కొన్నారు. మహిళా సాధికారత పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే... రిషికేశ్వరి మరణానికి కారకులు ఎవరో చెప్పాల‌న్నారు. ఉత్తరాంధ్ర మంత్రి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న‌ మంత్రిని చంద్రబాబు తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

టీడీపీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని మహిళలు కనకదుర్గమ్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేయాలని రోజా పిలుపునిచ్చారు. మైనార్టీ మహిళలకు కూడా టీడీపీలో విలువ లేదన్నారు. టీడీపీ నేతలకు కూడా రాఖీ శుభాకాంక్షలు చెప్పే అర్హత లేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే మహిళలు బతకలేరని ఆమె అన్నారు. మహిషాసురుని మర్ధించే కాళికాదేవి మారిదిగా మహిళలు చంద్ర‌బాబు స‌ర్కారుపై తిరగబడాలన్నారు. ఏపీలో మహిళల ప్రాణ - ధన - మాన రక్షణకు భద్రత లేదన్నారు. దేశంలో నలుగురు మంత్రులపై ఆరోపణలు ఉంటే, అందులో ఇద్దరు ఏపీ వారేన‌న్న విష‌యాన్ని కూడా ఈ సంద‌ర్భంగా రోజా గుర్తు చేశారు. మ‌రి ఈ కామెంట్ల‌పై టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి. 
Tags:    

Similar News