ఏమైనా రోజా.. రోజానే బాస్
అధినేత సైతం ఘాటుగా స్పందించలేక సతమతం అవుతున్న వేళ.. పార్టీ వాదనను బలంగా వినిపించటం.. తమ రాజకీయ ప్రత్యర్థిపై మాటల తూటాల్ని ప్రయోగించటమే కాదు.. ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా తర్వాతే ఎవరైనానని చెప్పక తప్పదు. పార్టీ అధినేత వైఎస్ జగన్ దగ్గర నుంచి పేరు మోసిన నేతలు సైతం.. తాజాగా జరుగుతున్న ఆపరేషన్ ఆకర్ష్ కు కిందామీదా పడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఘాటుగా మాటల దాడి చేయటం అంత తేలికైన విషయం కాదు.
కానీ.. ఆ పనిని సక్సెస్ ఫుల్ గా చేస్తున్నారు ఆర్కే రోజా. చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మీద తీవ్రస్థాయిలో మండిపడిన రోజా.. ఒక సూటి సవాలు విసిరారు. రెండు రాష్ట్రాల్లోని తెలుగు వారి కంటే కూడా చిత్తూరు జిల్లా వారు విపరీతంగా నమ్మే నమ్మకాన్ని తెర మీదకు తెస్తూ రోజా చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా దోచుకోలేదని.. అవినీతికి పాల్పడలేదని అంటున్న చంద్రబాబుకి కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేసే దమ్ము.. ధైర్యం ఉన్నాయా? అని ప్రశ్నించారు. కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేసే వారి ప్రమాణాల్ని కోర్టులు కూడా పరిగణలోకి తీసుకుంటాయని చెబుతారు. కాణిపాకం ప్రమాణం చాలా పవర్ ఫుల్ అన్న మాట ఉంది.
అలాంటి ప్రమాణం చంద్రబాబు చేస్తారా? అంటూ రోజా సవాలు విసిరిన తీరుకు బాబు అండ్ కో ఉలిక్కిపడాల్సిందే. నిజానికి బాబు మాత్రమే కాదు.. కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేసేందుకు సవాలు విసిరిన రోజా కూడా చేయలేరేమో..? రోజా తాజాగా చేసిన కాణిపాకం ప్రమాణ సవాలుకు స్పందన వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. కాణిపాకం ప్రమాణాన్ని పక్కన పెడితే.. రాజకీయంగా కూడా తనదైన శైలిలో రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఛంద్రబాబు తన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని.. ఆ రోజున ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. ఆ రోజును ఎన్టీఆర్ ను సమాధి చేశారని.. ఈ రోజు ఎన్టీఆర్ ఆశయాలకు సమాధి చేస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల్ని కొన్నారని.. ఈ రోజు విజయవాడలో ఉంటున్న అక్రమ కట్టటంలో ఎమ్మెల్యేల్ని కొంటున్నట్లుగా ఆరోపించారు. ఏమైనా మాటల విషయంలో జగన్ పార్టీలో రోజా తర్వాతే ఎవరైనా అని చెప్పక తప్పదు.