సినీ నటుడి పార్టీ...విజయ్ కామెంట్స్

ఇక దేవుడు ఉన్నాడని ఆస్తికులు అంటారు. లేడని నాస్తికులు వాదిస్తారు. ఇది శతాబ్దాలుగా సాగుతున్న వివాదమే.

Update: 2026-06-23 19:30 GMT

తన పార్టీని సినిమా నటుడి పార్టీగా ప్రత్యర్ధులు అభివర్ణించడాన్ని విజయ్ తప్పు పట్టారు. తమ పార్టీ ఎదుగుదలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు అని ఆయన విమర్శించారు. 2026లో జరిగిన ఎన్నికలు తమిళనాడులో కులం మతం అన్న అంతరాలను చెరిపేసి ఏకమొత్తంగా ప్రజలు తమ పార్టీని సమర్ధించేలా జరిగాయని అన్నారు. తాము అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వామపక్షలతో పాటు మరి కొన్ని పార్టీలు స్వచ్ఛందంగానే చేరాయని, ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదని డీఎంకే నేతలకు విజయ్‌ పరోక్షంగా చురకలు అంటించారు. తమిళనాడులో బడ్జెట్ సెషన్ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద విజయ్ మాట్లాడుతూ, తన పార్టీకి జనం మద్దతు పూర్తిగా ఉందని అన్నారు.

పొత్తులు లేకుండా పోటీ :

టీవీకే 2026 అసెంబ్లీ ఎన్నికలలో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదని తన సొంత సిద్ధాంతాన్ని జనం ముందు పెట్టి వారి మద్దతు స్వీకరించింది అని అన్నారు. ఆ విధంగా తొలిసారి ఎన్నికల్లోనే 35 శాతం ఓట్లు సాధించిందని ఆయన గుర్తు చేశారు. అంతే కాకుండా 1.72 కోట్ల ఓట్లు పొందిన టీవీకే తమిళనాడులో ఒక బలమైన స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగిందని విజయ్ చెప్పారు. తాము ప్రజల వద్దకు వెళ్ళి వారి సంఘీభావం అందుకున్నాకనే పార్టీని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

దేవుడి మీద విశ్వాసం :

ఇక దేవుడు ఉన్నాడని ఆస్తికులు అంటారు. లేడని నాస్తికులు వాదిస్తారు. ఇది శతాబ్దాలుగా సాగుతున్న వివాదమే. ఇదిలా ఉంటే నాస్తికుడుగా తాను ఉంటాను అని ప్రకటించుకున్న వారు అనేకమంది రాజకీయాల్లో ఉన్నారు. తమిళనాడుకు వస్తే పెరియార్ ప్రభావంతో పాటు ద్రవిడవాదాన్ని బలంగా నమ్ముతారు. పెరియార్ పక్కా నాస్తికుడు అన్న సంగతి తెలిసిందే. మరి ఆయన అనుచరులు కానీ ఆయన సిద్ధాంతాన్ని పుణికి పుచ్చుకుంటామని చెబుతున్న వారు అంతా నాస్తికులేనా అంటే కానే కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అయితే పెరియార్ సామాజిక సిధ్దాంతాల వరకే తాము కట్టుబడి ఉంటామని పెరియార్ ఆధ్యాత్మిక చింతన విషయంలో చూస్తే తమ భావాలు వేరు అని నిండు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసారు.

దేవుడిని నమ్ముతా :

తాను పెరియార్‌ నాస్తికత్వాన్ని ఏ మాత్రం అంగీకరించలేదని క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు తనకు పూర్తి స్థాయిలో దేవుడి మీద నమ్మకం ఉందని విజయ్ చెప్పుకొచ్చారు. అంతే కాదు తమ పార్టీకి అంబేడ్కర్‌ కామరాజ్‌ సిద్ధాంతాలే స్ఫూర్తి గా ఆయన పేర్కొన్నారు. దేవుడి విషయంలో తనకు విశ్వాసం ఉందని దానిని తాను ఎపుడూ దాచి పెట్టలేదని కూడా విజయ్ చెప్పారు. అంబేద్కర్ సిద్ధాంతం అయిన అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయంపై తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇక పారదర్శకంగా నిజాయతీతో కూడిన పరిపాలన అందించే విషయంలో తమిళనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కామరాజ్‌ను ఆదర్శంగా తీసుకున్నామని విజయ్ చెప్పుకొచ్చారు తమ ప్రభుత్వం ప్రజలందరి పక్షమని ఉత్తమమైన పాలనను అందిస్తామని కూడా విజయ్ అసెంబ్లీ సాక్షిగా భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News