ఏపీలో కేజీఎఫ్ ఎక్కడంటే...బాబు చేతుల మీదుగా !
దేశంలోనే దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఏర్పాటైంది. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌కు ప్రభుత్వం పధినేను ఎకరాల భూమిని కేటాయించింది.
రాయలసీమలో బంగారం పంట...చంద్రబాబుకు అరుదైన అవకాశం దేశంలో ఇటీవల కాలంలో ఎక్కడా బంగారం పంటకు ఏ ముఖ్యమంత్రీ శ్రీకారం చుట్టలేదు. ఆ అరుదైన అవకాశం ఏపీ సీఎం చంద్రబాబుకు దక్కుతోంది. ఆయన ఏకంగా వెనకబడిన రాయలసీమలో బంగారం పంటను పండించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతునారు. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు కి చంద్రబాబు ఈ నెల 24న ప్రారంభం చేయనున్నారు. ఇదిలా ఉంటే బంగారు గనుల నిక్షేపాలు అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వ్చ్చేది కర్నాటక రాష్ట్రంలోని కేజీఎఫ్. ఇపుడు ఏపీ కూడా మరో కేజీఎఫ్ మారు మోగనుంది. దాని పేరు జొన్నగిరి.
అతి పెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ :
దేశంలోనే దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఏర్పాటైంది. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌కు ప్రభుత్వం పధినేను ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో ఇక్కడ ప్రస్తుతం మొదటి దశలో ఆరు వంద్లల ఎకరాలలో తవ్వకాలు జరగనున్నాయి. దీనికి తగినట్టుగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. రెండో దశలో మిగిలిన ప్రాంతంలోనూ ప్లాంట్ విస్తరించున్నారు. ప్రస్తుతం ఏర్పాటైన ఈ ప్లాంట్ ద్వారా మొదటి ఏడాదికి ఏకంగా 400 కిలోల పసిడిని ఉత్పత్తి చేయనున్నారు. ఇక రెండవ ఏడాది నుంచి 900 కిలోల బంగారం ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఏటేటా బంగారం ఉత్పత్తి పెరుగుతూ ఒక దశకు వచ్చేసరికి ఏడాదికి 2 టన్నుల వరకు బంగారం జొన్నగిరి కేంద్రంగా ఉత్పత్తి చేయనున్నారు. ఈ మేరకు ప్లాంట్ సామర్థ్యాన్ని ప్రాసెసింగ్ కెపాసిటీని విస్తరించనున్నారు.
ప్రభుత్వానికి రాయల్టీ :
ఇక ఈ ప్లాంట్ ద్వారా దాదాపుగా ఏడు వందల మందికి ఉపాధి లభిస్తుంది. ఇక ఉత్పత్తి చేసిన బంగారం ధరలో 4 శాతం రాష్ట్రానికి రాయల్టీగా వస్తుంది. మొదట తీసే 400 కేజీలకు రూ.57 కోట్ల రూపాయలు ఏపీ ఖజానాకు వస్తే 900 కేజీలకు 144 కోట్ల వరకూ రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రానుందని చెబుతున్నారు. దీంతో ఏపీ ఇక మీదట బంగారం పంట ద్వారా కూడా సంపదను పెంచుకుంటుంది అన్న మాట. ఏపీకి ఇది నిజంగా ఒక వరంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు అత్యంత వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు పసిడి పంటతో దశ తిరగనుంది అని అంటున్నారు.
చంద్రబాబు శ్రీకారం :
ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 24 న బుధవారం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అదే విధంగా ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండవ యూనిట్ కి కూడా శంకుస్థాపన చేయనున్నారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు 405 కోట్ల రూపాయల పెట్టుబడితో బంగారు నిక్షేపాలు వెలికితీసే ఈ కర్మాగారాన్ని నెలకొల్పాయి. ఇక ఈ ప్లాంటికి ఇందుకు అవసరమైన నీటి కోసం హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 18 కిలోమీటర్ల దాకా పైపులైన్‌తో 0.021 టీఎంసీలను వినియోగించనున్నారు. ఇక చంద్రబాబు చేతుల మీదుగా బంగారం ఉత్పత్తి పనులు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే గనిలో ట్రయల్ రన్స్ కూడా పూర్తయ్యాయి. మొత్తం మీద చూస్తే ఏపీకి ఒక కేజీఎఫ్ తయారవుతోంది అన్న మాట.