ఈ మూడు దేశాలూ భారత్ ని ఛాలెంజ్ చేస్తాయా ?
దాయాదికి తాను ఏమైపోయినా ఫరవాలేదు, భారత్ మీద మాత్రం కక్ష సాధించాలని చూస్తుందని అంటారు.
దాయాదికి తాను ఏమైపోయినా ఫరవాలేదు, భారత్ మీద మాత్రం కక్ష సాధించాలని చూస్తుందని అంటారు. భారత్ తో వేయి ఏళ్ళ పాటు యుద్ధం చేస్తామని ప్రకటించిన ఘనత ఇదే దాయాదిది. ఇక ఆచరణలో అదే చేస్తోంది. ప్రత్యక్ష యుద్ధాలతో పాటు పరోక్ష యుద్ధాలు ఉగ్రవాదులకు చేయూతని ఇవ్వడం వంటివి పాక్ చేస్తూ తన దుర్బుద్ధిని ఎప్పటికపుడు బయట పెట్టుకుంటూ వస్తోంది. 2025 ఏప్రిలో జరిగిన పహిల్గాం ఉగ్ర దాడి తరువాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో గట్టిగానే గుణపాఠం చెప్పింది. అయితే పాక్ కి ఆ గుణపాఠం వేడి చల్లారినట్లే కనిపిస్తోంది. దాంతో తాజాగా భారత్ ని పెను సవాల్ చేసేలా దాయాది కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
చారిత్రాత్మక ఒప్పందం అంటూ :
అయితే ఇది చారిత్రక రక్షణ ఒప్పందం అంటూ దాయాది గట్టిగా ప్రచారం చేసుకుంటోంది. ఈ ఒప్పందం అంతా భారత్ మీద పై చేయి సాధించాలన్న దురాశ కోసమే అని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదో విధంగా భారత్ ని ఇబ్బంది పెట్టడానికి పాక్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది కొత్త మలుపు అని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దాయాది పాక్ కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఏమిటి అంటే పాక్, సౌదీ, టర్కీ అన్న మూడు ముస్లిం దేశాలు కలసి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరుతో త్రైపాక్షిక ఒప్పందంగా ముందుకు వచ్చారు అన్న మాట. ఈ ఒప్పందంలో విశేషం చూస్తే కనుక ఈ మూడింటిలో ఏ ఒక్క దేశంపైన దాడి జరిగినా మొత్తం మూడింటిపైనా జరిగే దాడిగా దీనిని భావిస్తారు. దాంతో మిగిలిన రెండు దేశాలు కూడా కలసికట్టుగా దాడి చేస్తాయన్న మాట.
ఇచ్చి పుచ్చుకోనున్న వైనం :
ఇక ఈ ఒప్పందం ద్వారా ఈ మూడు దేశాలు ఒకరికి ఒకరు రక్షణ, సాంకేతికత, ఆర్ధికంగా కలసి పంచుకుంటాయని తెలుస్తోంది. అలాగే మూడు దేశాలూ కలసి ఉమ్మడి సైనిక విన్యాసాలు చేపడతాయి. అలాగే తమ దేశాలలోని రక్షణ దళాలకు ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాయి. మూడు దేశాల మధ్య నిఘా సమాచార మార్పిడికి మార్గం సుగమం అవుతుంది. ఇక ఈ మూడు దేశాల్లో పాక్‌కు మాత్రమే అణ్వాయుధ సామర్థ్యం ఉంది అన్నది తెలిసిందే అలాగే సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్‌లు శుక్రవారం జెడ్డాలో జరిగిన కీలక సమావేశంలో సంయుక్త రక్షణ ఒప్పందంపై మూడు దేశాలూ సంతకం చేశాయి.
పాక్ తోనే భారత్ కి వైరం :
మరో విషయం ఏమిటి అంటే భారత్ కి పాక్ తోనే ప్రధానంగా ఇబ్బంది వైరం గట్టిగానే ఉంది. అలాగే పాక్ చూపు కూడా భారత్ మీదనే ఉంది. ఇక సౌదీ అరేబియాతో భారత్ కి సామరస్య వైఖరి ఉంది. టర్కీ అయితే తోక జాడిస్తూ భారర్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ కి ఆయుధాలను సమకూర్చింది అన్నది ప్రచారంలో ఉంది. మరి పాక్ తో కలసి సంయుక్త ఒప్పందానికి సౌదీ ముందుకు రావడంతో సౌదీ భారత్ స్నేహం మీద ఇది తీవ్ర ప్రభాం చూపించే చాన్స్ కనిపిస్తోంది. ఇక పాక్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. అలాగే సౌదీ వద్ద పెద్ద ఎత్తున ఆర్ధిక వనరులు అలాగే ఇంధన వనరుల బలం ఉంది. ఇక టర్కీకి అత్యాధునిక రక్షణ సామర్ధ్యం ఉంది. మరి ఈ మూడు దేశాలూ భారత్ ని చాలెంజ్ చేస్తాయా, చేస్తే భారత్ పరిస్థితి ఎలా ఉండబోతోంది. భారత్ ఏ విధంగా ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది.