వంగవీటి ఆశా కిరణ్... మన ప్రభుత్వం వస్తుంది వ్యాఖ్యలు వైరల్ !
వంగవీటి మోహన రంగా ఒక ఐకానిక్ ఫిగర్. ఆయన పేరు వింటేనే పవర్ ఫుల్ వైబ్రేషన్స్ వస్తాయి.
వంగవీటి మోహన రంగా ఒక ఐకానిక్ ఫిగర్. ఆయన పేరు వింటేనే పవర్ ఫుల్ వైబ్రేషన్స్ వస్తాయి. రాజకీయాల్లో కేవలం అయిదేళ్ళు మాత్రమే పనిచేసిన రంగా మూడున్నరేళ్ల పాటు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే రంగా అన్న రెండక్షరాల పేరు ఎపుడూ ఏపీ రాజకీయాల్లో పవర్ ఫుల్ గానే ఉంటూ వస్తోంది. ఆయన తనయ వంగవీటి ఆశా కిరణ్ ఈ మధ్య కాలంలోనే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమె ఏ పార్టీలో చేరలేదు కానీ తన తండ్రి రంగా పేరుతో జరిగే సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ వారసురాలిగా బలమైన ముద్ర వేసుకోవాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఆశా కిరణ్ లో ఇంత ఫైర్ ఉందా అన్నది అయితే తాజాగా గోదావరి జిల్లాలలో జరిగిన ఒక సంఘటన తెలియచేసింది.
రంగా విగ్రహం తొలగింపు :
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని తొలగించిన ఘటన తాజాగా తీవ్ర రాజకీయ వివాదానికి అదే సమయంలో భారీ ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో తన తండ్రి విగ్రహాన్ని ఎందుకు తొలగించారు అన్న దాని మీద వంగవీటి ఆశా కిరణ్ అయితే నేరుగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. ఆమె పోలీసుల మీద ఒక దశలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు నేరుగా రంగంలోకి దిగి పోలీస్ అధికారులతోనే వాగ్వాదం చేస్తూ అక్కడే బైఠాయించి మరీ పోరాటానికి దిగారు. ఒక దశలో ఆమె ఆవేశంతో పోలీసుల తీరుని తప్పుబడుతూ చేశారు. ఆమె వెంట మద్దతుదారులు కూడా పెద్ద సంఖ్యలో చేరడంతో పోలీసులు సైతం ఏమి చేయలేని పరిస్థితి ఎదురైంది.
అనుమతులు లేవనే :
ఇదిలా ఉంటే ఉండ్రాజవరం సెంటర్‌లో కాపు యువత వంగవీటి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ దానికి సరైన అనుమతులు లేవనే కారణంతో పోలీసు అధికారులు ఆ విగ్రహాన్ని దిమ్మెను తొలగించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ మరుసటి రోజు రంగా అభిమానులు మళ్లీ మరో విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే దాన్ని కూడా అధికారులు పొక్లెయిన్ సహాయంతో తొలగించడంతో అసలు వివాదం అక్కడ వివాదం మొదలై అది కాస్తా ఉధృతమైంది. ఈ నేపధ్యంలో వంగవీటి ఆశాకిరణ్ తన తండ్రి విగ్రహాన్ని తొలగించారనే విషయం తెలుసుకుని ఉండ్రాజవరం చేరుకుని నేరుగానే రంగంలోకి దిగారు. ఎక్కడైతే రంగా విగ్రహాన్ని తొలగించారో ఆ దిమ్మె వద్దనే రంగా అభిమానులతో కలిసి ఆమె మెరుపు ధర్నాకు దిగారు. అంతే కాదు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక పోలీసులు కూడా అదే స్థాయిలో బదులివ్వడంతో వివాదం ముదిరి పెద్దది అయింది.
మన ప్రభుత్వం వస్తుంది :
తన తండ్రి వంగవీటి రంగా గారి విగ్రహాన్ని ఏం చేశారు అని ఈ సందర్భంగా ఆశా కిరణ్ ప్రశ్నించారు. అసలు రంగా విగ్రహం అంటే మీకెందుకు అంత భయం అని కూడా ఆమె పోలీసులను నిలదీశారు. ఒక దశలో అయితే లీసులకు, ఆశా కిరణ్‌కు మధ్య తోపులాట జరిగి మరింతగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో ఆశా కిరణ్ మాట్లాడుతూభవిష్యత్తులో మన ప్రభుత్వం వస్తుందంటూ వ్యాఖ్యానించడం అయితే ఇపుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అంతే కాదు అది వైరల్ అవుతోంది. భవిష్యత్తులో ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం మనది కాదు అనే కదా ఆశా కిరణ్ సందేశం ఇచ్చారు అని అంటున్న వారు ఉన్నారు. మన ప్రభుత్వం అంటే ఆమె కొత్తగా పార్టీ పెడుతున్నారా లేక వేరే పార్టీలో చేరుతున్నారా అన్నది కూడా విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉండ్రాజవరం ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మొహరించారు. మరోవైపు రంగా కుమార్తెకు భద్రత కల్పించాలని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని కాపు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.