ప‌వ‌న్‌ను కాపాడుకోవాలి.. రంగంలోకి దిగండి: చంద్ర‌బాబు

క‌ర్నూలులో కుటుంబ వివాదాల నేప‌థ్యంలో త‌మ కుమారుడిని తల్లిదండ్రులు హ‌త‌మార్చారు. ఈ క్ర‌మంలో త‌ల్లిదండ్రుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

Update: 2026-06-23 18:30 GMT

జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై వైసీపీ నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. సోష‌ల్ మీడి యా వేదిక‌గా.. పాత వీడియోల‌ను ప్ర‌చారం చేస్తూ.. వైసీపీ నేత‌లు.. ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు స్పందించారు. వైసీపీ చేస్తున్న ఈ ద్రుష్ప్ర‌చారాన్ని అడ్డుకోవాల‌ని.. జ‌న‌సేన అధినేత‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం.. మంత్రుల‌తో ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్సు నిర్వ‌హిం చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై అవాకులు చ‌వాకులు ప్ర‌చారం చేస్తున్న వైసీపీ నేత‌ల‌కు అంతే బ‌లంగా కౌంట‌ర్ ఇవ్వాల‌ని తేల్చి చెప్పారు.

ప్ర‌స్తుతం వైసీపీ నేర‌గాళ్ల‌కు, గంజాయి ముఠాల‌కు మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని.. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించి ప్ర‌భుత్వం పైనా డిప్యూటీ సీఎంపైనా బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చంద్ర‌బాబు అన్నారు. ఈ స‌మ‌యంలో చూస్తూ కూర్చోవ‌ద్ద‌ని.. ఆధారాల‌తో స‌హా వైసీపీ నేత‌ల‌కు బుద్ధి చెప్పాల‌ని పిలుపునిచ్చారు. రాజకీయంగా చేస్తున్న ఈప్ర‌చారాన్ని రాజ‌కీయంగానే ఎదుర్కొనాల‌ని పిలుపునిచ్చారు. మంత్రులు ప్ర‌తి ఒక్క‌రూ ఈ విష‌యంలో స్పందించాల్సిందేన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. క‌ర్నూలు, కృష్ణ‌లంక ఘ‌ట‌న‌ల‌పై వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ఆయ‌న సూచించారు.

ఏం జ‌రిగింది?

క‌ర్నూలులో కుటుంబ వివాదాల నేప‌థ్యంలో త‌మ కుమారుడిని తల్లిదండ్రులు హ‌త‌మార్చారు. ఈ క్ర‌మంలో త‌ల్లిదండ్రుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే.. బాధితుడి త‌ల్లి గంగ‌మ్మ‌.. పోలీసు విచార‌ణ స‌మ‌యంలోనే మృతి చెందింది. మ‌రోవైపు.. బాధితుడి తండ్రి కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. దీనిపై ప్ర‌స్తుతం జ్యుడీషియ‌ల్ ఎంక్వ‌యిరీ జ‌రుగుతోంది. గంగ‌మ్మ మృతి వెనుక పోలీసులు ఉన్నార‌న్న‌ది వైసీపీ నాయ‌కులు చేస్తున్న ఆరోప‌ణ‌. అంతేకాదు.. గంగ‌మ్మ భ‌ర్త‌ను కూడా ఇష్టానుసారంగా కొట్ట‌డంతో అత‌ను న‌డ‌వ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాడ‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

మ‌రో ఘ‌ట‌న‌లో కృష్ణ‌లంక‌కు చెందిన సాయికృష్ణ అదృశ్య‌మ‌య్యాడు. అయితే.. ఈ ఘ‌ట‌న వెనుక కూడా పోలీసులు ఉన్నార‌ని.. సీఐ నాగ‌రాజు బాధితుడిని కొట్ట‌డంతోనే ఘ‌ట‌న జ‌రిగింద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇక‌, ఈ వ్య‌వ‌హారం ప‌లు మ‌లుపులు తిరగ‌డం.. కులం పేరుతో రాజకీయాలు చేయ‌డం వంటివి కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. చిత్రంలో అటు క‌ర్నూలు, ఇటు కృష్ణ‌లంక‌కు చెందిన బాధితులు కూడా ఒకే సామాజిక వ‌ర్గం కావ‌డంతో ఈ వ్య‌వ‌హారం మ‌రింత ముదిరి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను కార్న‌ర్ చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు జ‌న‌సేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. ఈ ప‌రిణామాల తో అలెర్ట్ అయిన‌.. సీఎం చంద్ర‌బాబు మంత్రులు స్పందించాల‌ని, ప‌వ‌న్‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టి ఆయ‌న‌ను కాపాడుకోవాల‌ని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News