సీజేపీ ఇన్ స్టాగ్రామ్ ఖాతా మళ్లీ పునరుద్ధరణ.. 'బ్లడీ కవర్డ్స్' అంటూ అభిజీత్ దీప్కే ఫైర్

మెటా మార్క్ మామ సడన్‌గా హ్యాండిల్‌ను డిలీట్ చేయడంతో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కుర్రాడికి ఎక్కడ లేని కోపం వచ్చి... ఎక్స్ వేదికగా "బ్లడీ కవర్డ్స్!" అంటూ రక్త పిశాచులారా.. భయస్తులారా అంటూ విరుచుకుపడ్డారు.

Update: 2026-08-15 08:07 GMT

దేశమంతా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న శుభ ముహూర్తాన... సోషల్ మీడియా ప్రపంచంలో ఒక విచిత్రమైన ‘రాజకీయ సమరం’ జరిగిందండోయ్.. వినూత్నమైన పేరుతో నిత్యం వార్తల్లో నిలిచే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా గాల్లో కలిసిపోయింది. మెటా మార్క్ మామ సడన్‌గా హ్యాండిల్‌ను డిలీట్ చేయడంతో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కుర్రాడికి ఎక్కడ లేని కోపం వచ్చి... ఎక్స్ వేదికగా "బ్లడీ కవర్డ్స్!" అంటూ రక్త పిశాచులారా.. భయస్తులారా అంటూ విరుచుకుపడ్డారు.

అసలే స్వాతంత్ర్య దినోత్సవం... ఆ సమయంలో ‘యూజర్ నాట్ ఫౌండ్’ అని పడితే ఏ నేతకైనా ఒళ్లు మండదా చెప్పండి? మెటా సంస్థ తమ గొంతు నొక్కడానికి కుట్ర చేసిందని.. తమ పగవారికి స్వైచ్ఛ ఇచ్చిందని దీప్కే గారూ పెద్ద ఎత్తున స్క్రీన్‌షాట్లు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు. సీజేపీ వ్యతిరేకులు కావాలనే ఇండిపెండెన్స్ డే రోజున ఈ డిజిటల్ దాడికి ప్లాన్ చేశారని పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. అయితే ఈ ‘డిజిటల్ సస్పెన్స్ డ్రామా’ ఎక్కువ సేపు సాగలేదు.. డిలీట్ అయిన కొద్దిసేపటికే ఖాతాను విజయవంతంగా తిరిగి పునరుద్ధరించుకున్నట్లు సీజేపీ గర్వంగా ప్రకటించింది. “మా గొంతు నొక్కడం ఎవరి తరం కాదు” అంటూ ట్విట్టర్‌లో విక్టరీ సైన్ వేసేశారు.

అయినా సీజేపీకి ఇలాంటి సోషల్ మీడియా 'స్ట్రోక్‌లు' కొత్తేమీ కాదు లెండి.. గత మే నెలలోనే దీప్కే గారి వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్‌కి గురైంది.. దానికి తోడు బ్యాకప్ ఖాతాను కూడా మెటా లేపేసింది. మరి 'కాక్రోచ్' పేరు పెట్టుకున్నప్పుడు... ఎన్నిసార్లు తొక్కినా మళ్లీ తిరిగి రావడం వాళ్ల నైజమే కదా..

'స్కూల్ ఠీక్ కరో' అంటూ గ్రామీణ పోరు

ఖాతా పోయినా.. వచ్చిన విమర్శలు ఎలా ఉన్నా... దీప్కే మాత్రం తన మార్క్ 'హంగామా'ను ఆపలేదు. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రి అనే దీప్కే స్వగ్రామం ప్రభుత్వ పాఠశాలలో ‘స్కూల్ ఠీక్ కరో’ అనే కొత్త ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు.

పాఠశాలల్లో మౌలిక వసతులు తెస్తాం

ఊరి బడిలో కనీసం బెంచీలు, సరైన తాగునీరు ఉండేలా స్థానిక సర్పంచ్‌ను నిలదీస్తామని.. గ్రామాల్లో పర్యటించి బడుల సమస్యలు తీరుస్తామని సీజేపీ బృందం ప్రతీన పూనింది. ప్రజలు కూడా తమ పిల్లల బడుల్లో లోపాలు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.

మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మళ్లీ రావడం... ఒకవైపు 'స్కూల్ ఠీక్ కరో' ప్రచారం మొదలవ్వడంతో... ఈ కాక్రోచ్ పార్టీ సోషల్ మీడియాలోనూ.. గ్రామీణ రాజకీయాల్లోనూ భలే 'రచ్చ' లేపుతోంది..




Tags:    

Similar News