''రిజ‌ర్వేష‌న్‌.. రాజ‌కీయం కోసం కాదు''

రాజ్యంగ క‌ర్త‌లు.. విశాల దృక్ఫ‌థంతో చేసిన రిజ‌ర్వేష‌న్ అవ‌కాశాన్ని రాజ‌కీయం చేయ‌డం స‌రికాద‌ని తెలిపింది.

Update: 2026-09-29 11:40 GMT

ఏ రిజ‌ర్వేష‌న్ అయినా.. రాజ‌కీయాలు చేయడం స‌రికాద‌ని ఏపీ హైకోర్టు పేర్కొంది. స‌మాజంలో అణ‌గారిని వ‌ర్గాల‌ను ఆదుకునేందుకు.. స‌మాజంలో వారిని ఉన్న‌త‌స్థాయికి తీసుకువ‌చ్చేందుకు రిజ‌ర్వేష‌న్ల క‌ల్ప‌న ఉండాల‌ని పేర్కొం ది. రాజ్యంగ క‌ర్త‌లు.. విశాల దృక్ఫ‌థంతో చేసిన రిజ‌ర్వేష‌న్ అవ‌కాశాన్ని రాజ‌కీయం చేయ‌డం స‌రికాద‌ని తెలిపింది. రాజ‌కీయ పార్టీలు, వ్య‌క్తిగ‌త ల‌బ్ధి కోసం ప్ర‌య‌త్నించేవారు.. రిజ‌ర్వేష‌న్‌ను ఆయుధంగా వాడుకుంటున్నార‌ని పేర్కొంది.

ఏపీలో స్తానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బీసీ సామాజిక వ‌ర్గానికి 34 శాతం మేర‌కు రిజ‌ర్వేష‌న్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించి.. ఈ మేర‌కు జీవో కూడా జారీ చేసింది. అయితే.. రాజ్యాంగ నియ‌మాల ప్ర‌కారం.. రిజ‌ర్వేష‌న్ 50 శాతం మించ‌రాద‌ని.. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో రిజ‌ర్వేష‌న్లు 60 శాతానికి మించి పోయాయ‌ని పేర్కొంటూ.. కొంద‌రు పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. వీటిపై విచార‌ణ చేస్తున్న హైకోర్టు తాజాగా మంగ‌ళ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

రిజ‌ర్వేష‌న్ల‌ను రాజ‌కీయంగాకాకుండా.. స‌మాజం కోసం వినియోగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది. ఒక‌వైపు ఉన్న‌త‌స్థాయికి వ‌చ్చిన ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాలు రిజ‌ర్వేష‌న్ వ‌దులుకోవాల‌ని సూచిస్తున్న త‌రుణంలో రిజ‌ర్వేష‌న్ల‌ను ఎన్నిక‌ల కోసం వినియోగించ‌డం స‌రికాద‌ని న్యాయ‌వాది వాద‌న‌తో ఏకీభ‌వించింది. కాగా.. ఈ కేసులో మ‌రో న్యాయ‌వాది ఈశ్వ‌ర‌య్య ఇంప్లీడ్ పిటిష‌న్ వేశారు. దీంతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేసింది.

తెలంగాణ‌లో ..

తెలంగాణ‌లో కూడా బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ పెంచుతూ.. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంఈ ఏడాది నిర్ణ‌యించింది. అయితే.. దీనికి గ‌వ‌ర్న‌ర్‌, రాష్ట్ర‌ప‌తి కూడా అనుమ‌తి ఇవ్వ‌లేదు.దీంతో కోర్టును ఆశ్ర‌యించ‌గా.. అక్క‌డ కూడా స‌ర్కారుకు ఊర‌ట ల‌భించ‌లేదు. దీంతో గ‌త ఎన్నిక‌ల త‌ర‌హాలోనే రిజ‌ర్వేష‌న్‌ను ఖ‌రారు చేసి ఎన్నిక‌లు ముగించారు. ఇక‌, ఇప్పుడు ఏపీ విష‌యంలో ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News