పబ్ లో గబ్బు సీన్లు.. హైదరాబాద్ లో అరాచకం
ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని.. కేసుల పంచాయితీ ఎందుకని కొద్దిమంది తగ్గుతున్నట్లుగా చెబుతున్నారు.
పబ్ కల్చర్ ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్ రోడ్లు జాం అయ్యే సీన్లు ఇటీవల కాలంలో పబ్ ల వద్ద పెరిగింది. అదే సమయంలో గతానికి భిన్నంగా పబ్బుల్లో తరచూ పంచాయితీల పర్వం నడుస్తోంది. తాజాగా ఒక బుల్లితెర నటికి పబ్ లో వేధింపులు ఎదురయ్యాయి. ఈ ఉదంతంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని.. కేసుల పంచాయితీ ఎందుకని కొద్దిమంది తగ్గుతున్నట్లుగా చెబుతున్నారు.
తాజా ఉదంతంలోకి వెళితే.. ఒక టీవీ నటి తన అన్న.. బావతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 36లోని పబ్ కు వెళ్లారు. ఒక టేబుల్ వద్ద కూర్చొని మాట్లాడుకుంటుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో.. సోదరుడు.. బావలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన సదరు యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు. అప్పటికి నిద్ర లేచిన సదరు పబ్ కు చెందిన సెక్యూరిటీ దాడి చేస్తున్న యువకులను అడ్డుకొని బయటకు పంపించేశారు.
ఈ నేపథ్యంలో బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయటంతో వారు కేసు నమోదు చేశారు. వేధింపులకు పాల్పడుతున్న యువకులు.. దాడికి తెర తీసినప్పటికి పబ్ కు చెందిన సెక్యూరిటీ వారిని బయటకు పంపే ప్రయత్నం చేయటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు.. పబ్ లో సురక్షిత వాతావరణం ఉంటుందన్న విషయాన్ని చెప్పే కన్నా.. చేతులు దులిపేసుకున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో పబ్ లో గబ్బు ఘటనలు ఎక్కువ అవుతున్నట్లుగా చెబుతున్నారు.
ఈ వాదనకు బలం చేకూరే మరోఉదంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసుగా నమోదైంది. హైదరాబాద్ కు చెందిన 26 ఏళ్ల యువతి జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 36లోని మరో పబ్ కు కన్సల్టెంట్ గా వ్యవహరిస్తోంది. ఈ నెల 27న అత్తాపూర్ కు చెందిన ఒక వ్యక్తి పబ్ కు వచ్చి.. బాధితురాలి పట్ల అసభ్యంగా వ్యవహరించారు. దీంతో.. ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు.. కేసులు ఎందుకు? అన్న ధోరణితో తమకు ఎదురైన వేధింపుల విషయంలో మౌనంగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు. తరచూ పబ్ లో ఎదురవుతున్న ఈ తరహా ఉదంతాలకు చెక్ పెట్టేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్న మాట వినిపిస్తోంది.