తొలి రోజు ఇలా గడిచింది.. క్వారంటైన్ ​పై రోహిత్​ పోస్ట్​

Update: 2020-12-18 05:35 GMT
ఐపీఎల్ ఫైనల్ కు ముందు హిట్ మ్యాన్  రోహిత్  శర్మ  గాయపడ్డాడు. అయితే చివరి రెండు మ్యాచ్లకు మళ్లీ అందుబాటులోకి వచ్చాడు. ఫైనల్లో బ్యాట్ తో  దుమ్ముదులిపి జట్టును  చాంపియన్ గా  నిలిపాడు. అయితే గాయపడ్డ  రోహిత్ శర్మను ఆస్ట్రేలియా టూర్ కు  ఎంపిక చేయకపోవడంతో ఫ్యాన్స్,  మాజీ క్రికెటర్లు సెలక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ ను ఎంపిక చేయక పోవడానికి గల కారణాలను కూడా లభించకపోవడం పై మండిపడ్డారు. విమర్శలు తీవ్రతరం కావడంతో ఏకంగా బీసీసీఐ దిగి వచ్చి వివరణ ఇచ్చింది. ఆ తర్వాత రోహిత్ శర్మ బెంగళూరు క్రికెట్  అకాడమీలో ఫిట్నెస్ నిరూపించుకోవడంతో టెస్ట్ మ్యాచ్ లకు అతడిని ఎంపిక చేశారు.

ఆస్ట్రేలియా చేరుకున్న  ఎంపికైన రోహిత్​శర్మ ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నారు. హిట్​మ్యాన్​ రోహిత్​ శర్మ గాయం కారణంగా ఆస్ట్రేలియా వన్డే సీరిస్​, టీ20లో ఆడలేదు. అయితే టెస్ట్​సీరిస్​కు మాత్రం ఎంపికయ్యాడు. ఐపీఎల్​ సీజన్  మధ్యలో  రోహిత్​ గాయపడ్డాడు. కొన్నిరోజులపాటు రెస్ట్​ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఐపీఎల్​ ఫైనల్​ కు ముందు జట్టు లోకి వచ్చాడు. కానీ రోహిత్​ను మాత్రం ఆస్ట్రేలియా టూర్​కు ఎంపిక చేయలేదు. ఈ విషయంపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది. బీసీసీఐ సెలక్టర్ల తీరును క్రికెట్​ అభిమానులు సోషల్​మీడియా వేదికగా తప్పుపట్టారు. కొందరు సీనియర్​ క్రికెటర్లు సైతం రోహిత్​ను ఎందుకు ఎంపికచేయ్యలేదు అంటూ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే బీసీసీఐ రోహిత్​ను ఆస్ట్రేలియా టెస్ట్​ సీరిస్​కు ఎంపికచేసింది. దీంతో రోహిత్​ ఆస్ట్రేలియా వెళ్లాడు. కానీ అక్కడ రోహిత్​ 14 రోజులపాటు క్వారంటైన్​లో ఉండాలని.. ఆ తర్వాత వైద్యులు పరీక్షిస్తారని.. అప్పుడు కూడా ఫిట్ గా ఉంటే  రోహిత్​ టెస్ట్​సీరిస్​లో ఆడాలని బీసీసీఐ సూచించింది. దీంతో ప్రస్తుతం రోహిత్​ క్వారంటైన్ లో ఉన్నాడు.  శుక్రవారం క్వారంటైన్ లో ఓ ఫోటో తీసుకున్న రోహిత్ ఇన్​స్టాలో  పోస్ట్ చేసి ‘క్వారంటైన్​ డే1’ కామెంట్ పెట్టాడు. జనవరి 7 నుంచి రోహిత్​ సిడ్నీలో జరిగే మూడో టెస్ట్​లో ఆడే అవకాశం ఉంది.
Tags:    

Similar News