IPL : పరాగ్‌ పనితో కెప్టెన్సీ పోయేనా?

బుధవారం పంజాబ్‌తో రాజస్థాన్‌ రాయల్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో రియాన్‌ పరాగ్‌ డ్రెస్సింగ్‌ రూంలో సిగరెట్‌ తాగుతూ కనిపించాడు.;

Update: 2026-04-29 10:46 GMT

ఐపీఎల్‌ సీజన్‌ కావడంతో దేశ వ్యాప్తంగా క్రీడాభిమానులు క్రికెట్‌ ఫీవర్‌తో ఊగి పోతున్నారు. ఇప్పటికే సగం టోర్నమెంట్‌ పూర్తి అయింది. టోర్నమెంట్‌లో మ్యాచ్‌లు పూర్తి అవుతున్నా కొద్ది ఆట మరింత రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్‌ ప్రతి సీజన్‌ దేనికి అదే అన్నట్లుగా ఓ రేంజ్‌లో హిట్‌ అవుతూ వస్తున్న విషయం తెల్సిందే. ఐపీఎల్‌ సీజన్‌లో ఆటగాళ్ల ఆట గురించి మాత్రమే కాకుండా చాలా విషయాలు చర్చకు వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు వివాదాలు సైతం వస్తున్న విషయం తెల్సిందే. ఈసారి పెద్ద వివాదం ఏమీ లేదు అనుకుంటున్న సమయంలో రాజస్థాన్‌ రాయల్స్‌ టీం కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. అతడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎలక్ట్రానిక్‌ సిగరెట్‌ తాగుతూ కనిపించాడు. నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్‌ రూం లేదా స్టేడియంలో సిగరెట్‌ తాగడం పూర్తిగా నిషేదం.

రాజస్థాన్‌ రాయల్స్ జట్టు కెప్టెన్‌...

బుధవారం పంజాబ్‌తో రాజస్థాన్‌ రాయల్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో రియాన్‌ పరాగ్‌ డ్రెస్సింగ్‌ రూంలో సిగరెట్‌ తాగుతూ కనిపించాడు. అతడు వేపింగ్‌ చేస్తుండగా లైవ్ కెమెరాలకు చిక్కాడు. అంతే కాకుండా అతడి నోటి నుంచి క్లీయర్‌గా పొగ రావడం కూడా ఆ వీడియోలో చూడవచ్చు. క్షణాల్లోనే వీడియో వైరల్‌ అయ్యింది. పొద్దున్న వరకు పరాగ్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలు అయ్యాయి. సాధారణంగానే ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూంలో పొగ తాగడం, మధ్య సేవించడం చేయకూడదు. కానీ లైవ్‌ లో పరాగ్‌ వేపింగ్‌ చేస్తున్నట్లుగా కనిపించడంతో అతడిపై కఠిన చర్యలు తప్పవనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రాజస్థాన్‌ రాయల్స్ జట్టు యాజమాన్యం కానీ, ఇతర ఐపీఎల్‌ కి సంబంధింని వారు కానీ అధికారికంగా స్పందించలేదు. దాంతో ఈ విషయమై ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బీసీసీఐ కఠిన చర్యలు...

బాధ్యత గల కెప్టెన్సీలో ఉన్న పరాగ్‌ వేపింగ్‌ చేయడం వల్ల మొత్తం జట్టు కు ఆ మరక అంటినట్లు అయింది. దాంతో రాజస్థాన్‌ రాయల్స్ జట్టు యాజమాన్యం కచ్చితంగా అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి చర్యల విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ బీసీసీఐ నుంచి ఐపీఎల్‌ నిర్వాహకులకు అందిన ఆదేశాల అనుసారం పరాగ్‌ పై చర్యలు ఉండే అవకాశం ఉంది. లైవ్‌ లో పరాగ్‌ వేపింగ్‌ చేయడం కనిపించింది. అందుకే ఆయన్ను తప్పించే ప్రయత్నం చేయలేక పోతున్నారు. ఇప్పటికే వేపింగ్‌ వీడియోలు వైరల్‌ కావడంతో పాటు, కెప్టెన్‌ పరాగ్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇతర ఆటగాళ్లు ఎవరు కూడా హద్దులు దాటరు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఐపీఎల్‌ 2026లో..

నిర్ధేశిత జోన్‌లలో మినహా డ్రెస్సింగ్‌ రూమ్‌, స్టేడియం ప్రాంగణంలో స్మోకింగ్‌ చేయడం నిషేధం. అంతే కాకుండా ఇ సిగరెట్ల అమ్మకం, వేప్‌ల ఉత్పత్తి సైతం ఇండియాలో నిషేధం. అలాంటి నిషేధిత సిగరెట్లను తాగడం ద్వారా పరాగ్‌ పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్ జట్టు అతడిపై చర్యలు తీసుకోకున్నా ప్రభుత్వ పరంగా అతడిపై చర్యలు ఉండే పరిస్థితి ఉంది. అంతే కాకుండా బీసీసీఐ కూడా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. అంతా సాఫీగా సాగుతున్న రాజస్థాన్‌ రాయల్స్ జట్టు పెద్ద కుదుపుకు గురైంది. కెప్టెన్ ఇలాంటి చర్యలకు పాల్పడటంతో జట్టు యాజమాన్యం ఏం చేస్తుందా అనే ఆసక్తి నెలకొంది. ఐపీఎల్‌ 2026 లో వరుస విజయాలతో దూసుకు పోతున్న ఆర్‌ఆర్‌ కి ఇది పెద్ద షాక్‌. ముందు ముందు ఈ జట్టు ప్రదర్శణ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News