సాధారణంగా వీఐపీల పుత్రరత్నాలు అంటేనే వారు పొందే గౌరవం, వారికి ఉండే ఆత్మవిశ్వాసం ఒక రేంజ్లో ఉంటుంది. తమని తాము సో స్పెషల్ అనుకోవడం అలాంటి నాయకుల సుపుత్రులకు చాలా ఇష్టం. ఈ క్రమంలో వారు తమకు నచ్చినవన్నీ చేసేస్తుంటారు. అవి తప్పుడు పనులు కావచ్చు. థ్రిల్లింగ్ కోసం చేసే జల్సాలు, కారు రేసులు కూడా అయి ఉండవచ్చు. ఇలా అతి చేసిన ఓ ఎమ్మెల్యే కుమారుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో జరిగింది.
గుల్బర్గా జిల్లా అఫ్జల్ పూర్ ఎమ్మెల్యే మాలికయ్య వెంకయ్య కుమారుడు రితేష్ తన మిత్రులతో కలిసి కార్ రేస్‌లో పాల్గొన్నాడు. ఈ రేసులో జోరుగా దూసుకుపోతూ గమ్యస్థానానికి దగ్గరలో ఉన్న సమయంలో కారు అదుపు తప్పింది. మూడు నుంచి నాలుగు పల్టీలు కొట్టింది. ప్రమాదంలో రితేష్ నడుపుతున్న కారు పూర్తిగా దెబ్బతింది. ఏం జరిగి ఉంటుందో అని పలువురు ఆరా తీశారు. అయితే కారు తుత్తునుయలు అయినప్పటికీ రితేష్ సేఫ్ గా ఉన్నాడు.అయితే తమ సమీపంలో కార్ రేస్ జరగడం, అందులో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. కాగా. ఈ రేసుకు అనుమతి లేకపోవడం గమనార్హం. దీంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/