షికాగోలో మళ్లీ అల్లర్లు - లూటీ!

Update: 2020-08-11 06:35 GMT
అమెరికాలోని షికాగోలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి.  ఆందోళనకారులు కత్తులు, తుపాకులతో షాపింగ్ మాల్స్ లోకి చొరబడి లూటీకి తెగబడ్డారు. జార్జ్ ఫ్లాయిడ్ ఘటన తర్వాత చికాగోలో మళ్లీ ఈ స్థాయిలో అల్లర్లు జరగడం ఇదే మొదటిసారి. మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరపక తప్పలేదు. ఆందోళనకారుల దాడుల్లో సుమారు 13 మంది పోలీసులు గాయపడగా... ఒక నల్లజాతీయుడు మృతిచెందారు. వందమందిని పోలీసులు అరెస్టు చేశారు.

చికాగోలో అత్యవసరంగా కొన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయాలను ఆపేశారు. అల్లర్లు జరుగుతున్న డౌన్ టౌన్ ప్రాంతం పోలీసుల అదుపులో ఉంది. బయటకు వెళ్లాలన్నా, లోపలికి ప్రవేశించాలని ఐడీ కచ్చితంగా చూపించాలి. అల్లర్లు, అనిశ్చితిపై చికాగో మేయర్ మాట్లాడుతూ "ఇది మా నగరంపై దాడి, ఇది ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచుతుంది" అని వ్యాఖ్యానించారు. ఈయన డెమొక్రాట్ పార్టీకి చెందిన మేయర్.
Tags:    

Similar News