మరికొద్ది రోజుల్లో ‘బతుకమ్మ’ వరి వంగడం

Update: 2015-10-10 05:42 GMT
బతుకమ్మ సంప్రదాయాన్ని ఉద్యమ రూపంలోకి తీసుకురావటమే కాదు.. ఈ రోజు తెలంగాణ ఆత్మాభిమానానికి బతుకమ్మ ఒక ఐకాన్ గా మారిన పరిస్థితి. తెలంగాణ సంస్కృతి.. సంప్రదాయానికి నిలువెత్తు రూపంగా బతుకమ్మను షోకేస్ చేస్తున్నారు. ఇది తెలంగాణలో మాత్రమే కాదు.. విదేశాల్లో ఉన్న తెలంగాణ సమాజం కూడా బతుకమ్మను ప్రదర్శిస్తూ.. విశ్వవ్యాప్తం చేస్తున్నారు.

బతుకమ్మను మరింత విస్తృతం చేసే దిశగా తెలంగాణ సర్కారు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బతుకమ్మ పేరిట కొత్త వరి వంగడాన్ని తీసుకురానుంది. తెలంగాణ రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని నిలిచేలా.. ఇక్కడి కరవుకు తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే ఒక రకం వరి వంగడానికి బతుకమ్మ పేరును పెట్టాలని నిర్ణయించారు.

తెలంగాణ ప్రాంతంలో సాగుకు అనుకూలంగా ఉండే 14 మేలురకం వంగడాల్ని విడుదల చేయనున్నారు. ఇందులో జేజీఎల్ 18047 రకం వంగడానికి బతుకమ్మ వరి వంగడంగా పేరు పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి బతుకమ్మను వీలైనన్ని మార్గాల్లో విశ్వవ్యాప్తం చేసే దిశగా తెలంగాణ అధికారపక్షం ప్రణాళికలు రచిస్తోన్నట్లుంది.
Tags:    

Similar News