ప్రియాంక గాంధీ టీంలో రేవంత్ రెడ్డినా?

Update: 2020-08-11 06:15 GMT
వయోభారంతో సోనియా గాంధీ పనిచేయలేకపోతున్నారు.. రాహుల్ గాంధీ కాడి వదిలేశాడు. దీంతో దేశ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రియాంక గాంధీ కీలకపాత్ర పోషించబోతోందట.. ఈ క్రమంలోనే సీనియర్లకు మంగళం పాడి యువ నేతలకు అందలం ఎక్కించాలని  పక్కా  ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలిసింది.

ప్రియాంక గాంధీ అన్ని రాష్ట్రాల్లో యూత్ ని ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యిందట.. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపేందుకు నిర్ణయం తీసుకుందట.. తెలంగాణలో కాంగ్రెస్ కు విపరీతంగా ఓటు బ్యాంకు ఉంది.. కర్ణాటక తర్వాత  రెడ్డి సామాజికవర్గం అండ తెలంగాణలో కాంగ్రెస్ కే ఉంది.   తెలంగాణలో రెడ్డి సామాజికవర్గానికే పీసీసీ పీఠం ఇవ్వాలని ప్రియాంక ఒత్తిడి తెస్తోందట..  అందులో యువనేత రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లను ప్రియాంక గాంధీ పరిశీలిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అయితే కోమటిరెడ్డిని సెంట్రల్ టీమ్ లో వేసి.. రేవంత్ రెడ్డికి రాష్ట్ర పీసీసీ ఇస్తే సరిపోతుందని ప్రియాంక భావిస్తోందట.. ఇక సీనియర్ వెటరన్స్ ను పక్కనపెట్టి  వాళ్ల వారసులైన పిల్లలకు సీట్లు  ఇవ్వాలని ప్రియాంక గాంధీ ఆలోచన చేస్తోందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అలా తెలంగాణ పీసీసీ చీఫ్ గా త్వరలోనే రేవంత్ రెడ్డిని నియమించడం ఖాయమని.. ఆయన ప్రియాంక టీంలోకి వెళ్లిపోతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News