కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు ఇచ్చేయండి

Update: 2015-07-29 09:09 GMT
కోహినూర్ వజ్రం... ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటి... భారత్ నుంచి దీన్ని బ్రిటన్ తరలించేశారు అప్పట్లో... ఇప్పుడు దాన్ని మళ్లీ తిరిగి ఇండియాకు ఇచ్చేయాలన్న ప్రతిపాదన బ్రిటన్ లో వస్తోంది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం... బ్రిటన్ ఎంపీ కీత్ వాజ్ బ్రిటన్ పార్లమెంటుకు ఓ లేఖ రాశారు... అందులో ఆయన కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగిచ్చేయాలంటూ విన్నవించారు. అంతేకాదు... అక్కడి పార్లమెంటులోనూ ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

కాగా కీత్ వాజ్ భారత సంతతి వ్యక్తి కావడం విశేషం. ఆయన ఇంతకుముందు కూడా భారత్ అనుకూల వాదనలు చేసేవారు. తాజాగా ఆయన కోహినూర్ వజ్రం ప్రస్తావన తేవడానికీ కారణం ఉంది. 200 ఏళ్లు పాలించిన బ్రిటన్ భారత్ కు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆమధ్య పేర్కొనగా కీత్ ఆ వాదనకు మద్దతు పలికారు. అయితే... థరూర్ అన్నట్లుగా పరిహారం ధనరూపంలో ఇవ్వడం కాదని.. అసలు ఆ నష్టానికి ధన రూపంలో విలువ కట్టలేమని... అక్కడి నుంచి తెచ్చిన విశిష్ట సంపదను తిరిగిచ్చేయడం మంచి సంప్రదాయమని ఆయన బ్రిటన్ పార్లమెంటుకు సూచించారు. అందులోభాగంగాన కోహినూర్ వజ్రాన్ని తిరిగిచ్చేయాలని అన్నారు.
Tags:    

Similar News