నగరం నడిబొడ్డులో వ్యక్తిపై కత్తులతో దాడి!
హైదరాబాద్ నగరంలో నేరాల సంఖ్యతో పాటు తీవ్రత కూడా పెరిగిపోతోంది. నగరం విస్తరిస్తున్న కొద్దీ క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. కోర్టుకు హాజరై వస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కత్తులతో దాడిచేసి కిరాతకంగా హతమార్చిన ఘటనను మరువక ముందే....నగరంలో జరిగిన మరో ఘటన కలకలం రేపుతోంది. తాజాగా, హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంకు ప్రాంతంలో ఓ వ్యక్తిపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తోన్న రిటైర్డ్ నేవీ ఆఫీసర్ ఇక్రమ్ ఖలీమ్ పై కత్తులు - తల్వార్లతో దాడి చేశారు. సెల్లార్ లో ఇక్రమ్ పై విచక్షణా రహితంగా కత్తులు రువ్వడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యలు - స్థానికులు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన గురించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దాడి వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అయితే, భూవివాదాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్రమ్ పై దాడి దృశ్యాలు సీసీ టీవీలో నమోదవడంతో పోలీసులు వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు. హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్ లో ఈ ఘటన జరిగింది. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ నడిబొడ్డులో పట్టపగలు ఓ వ్యక్తిని అడ్డగించిన దుండగులు అతడి బైకును అపహరించుకొని పోయిన సంగతి తెలిసిందే.
Full View