లఖింపూర్‌ ఆరాచకంలో మీడియా కవర్ చేయని అసలసిసలు వార్త

Update: 2021-10-05 06:33 GMT
ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది ట్రూలీ మ్యాడ్లీ అనే డేటింగ్ యాప్. ఈ సంస్థ తాజాగా ఒక సర్వేను నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఐదు వేల మంది అమ్మలతో నిర్వహించిన ఈ సర్వే ఫలితాలు ఇప్పటివరకు ఉన్న చాలా అభిప్రాయాల్ని మార్చేలా ఉండటం గమనార్హం. ప్రేమ పెళ్లిళ్లు అన్నంతనే తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న భావన చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా హైదరాబాద్ తల్లులు మాత్రం తమ పిల్లలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవటానికి తమకు ఎలాంటి అభ్యంతరంలేదని చెప్పినట్లుగా ఈ సర్వే వెల్లడించింది.

తాజాగా వెల్లడైన ఈ సర్వే.. తల్లుల మైండ్ సెట్ లో వచ్చిన మార్పునకు సంకేతంగా చెబుతున్నారు. సర్వేలో పాల్గొన్న హైదరాబాద్ అమ్మల్లో దాదాపు 84 శాతం మంది తమ పిల్లలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవటానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే.. మిగిలిన రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సేకరించిన అభిప్రాయాల్ని చూసినప్పుడు మాత్రం కేవలం యాభై శాతం మంది తల్లులు మాత్రమే లవ్ మ్యారేజీకి ఓకే చెప్పినట్లుగా తేలింది.

డేటింగ్ యాప్ లలో తమకు నచ్చిన అబ్బాయిని వెతుక్కోవటం తప్పు లేదని తల్లులు చెబుతున్నట్లుగా సర్వే వెల్లడించింది. అంతేకాదు.. హైదరాబాద్ తో పాటు సౌత్ కు చెందిన రాష్ట్రాల్లోని తల్లులు 37 శాతం మంది తమ పిల్లలు డేటింగ్ యాప్ లలో తమ జీవిత భాగస్వాములను గుర్తించటానికి తమకు ఎలాంటి అభ్యంతరంలేదని పేర్కొన్నట్లుగా వెల్లడించింది. ఈ సర్వే వివరాల్ని వెల్లడించిన సదరు డేటింగ్ యాప్ సీఈవో స్నేహిల్.. డేటింగ్ మీద ఉన్న అనుమానాల్ని..భయాల్ని తెలుసుకునేందుకు తామీ సర్వే చేపట్టామన్నారు. యూత్ తో పాటు వారి తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో మార్పు వచ్చిందని వ్యాఖ్యానించటం గమనార్హం. ఇదంతా చూస్తే.. నిజంగానే సర్వే చేశారా? లేక.. ఆ పేరుతో యాప్ ప్రమోషన్ చేసుకుంటున్నారా? అన్న అనుమానం రాక మానదు.


Tags:    

Similar News