మరో సంచలనానికి జియో రెడీ.. రూ. 4 వేలకే స్మార్ట్ ఫోన్!
టెలికామ్ మార్కెట్ లో జియో సంచలనం అంతా ఇంతా కాదు. ఆ రంగంలో దిగ్గజం సంస్థలు కూడా జియో దెబ్బకు కుదేలయ్యాయి. ఒక్క 3జీ 1జీబీ డేటా కి రూ.350 పెడుతున్న రోజులవి. దేశంలో డేటా వినియోగం చాలా తక్కువగా ఉంది. జనం నెలంతా కలిసి వన్ జీబీ డేటా మాత్రమే వినియోగించుకునేవారు. కాస్తో కూస్తో ఉన్నోళ్లే అంతకంటే ఎక్కువ జీబీ ఉపయోగించుకునేవారు. ఇక వీడియోల స్ట్రీమింగ్ చాలా తక్కువగా ఉండేది. జియో రాకతో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. జియో అతి చౌకగా 4జీ స్పీడ్ తో నెట్ ఇవ్వడంతో జనమంతా జియో వాడకం మొదలు పెట్టారు. అతి తక్కువకే జియో నెట్ ఇస్తుండటంతో మిగతా టెలికాం నెట్వర్క్ సంస్థలన్నీ ఘోరంగా నష్ట పోయి ఇప్పటికీ కోలుకోలేకున్నాయి.
ఇప్పుడిక జియో కన్ను స్మార్ట్ ఫోన్ల పై పడింది. ప్రస్తుతం సాధారణ ఫోన్లు వాడే వాళ్లు చాలా తక్కువ మంది అయ్యారు. చైనా అతి తక్కువ ధరల్లో స్మార్ట్ ఫోన్లు అందజేస్తుండడంతో జనం వాటిని కొనుగోలు చేస్తున్నారు. రెడ్ మీ, రియల్ మీ, వివో వంటి మొబైళ్ళు భారీగా అమ్ముడు పోతున్నాయి. దీంతో ముకేశ్ అంబానీ కన్ను స్మార్ట్ ఫోన్లపై పడింది.ప్రస్తుతం రూ.8 నుంచి రూ.10 వేల లోపు స్మార్ట్ ఫోన్ల విక్రయం మామూలుగా లేదు. అందుకే ఆ ధరల్లో ఎక్కువ మోడల్స్ విడుదల అవుతున్నాయి. దీంతో అంబానీ రూ.4 వేలకే స్మార్ట్ ఫోన్ అందజేసి మరో సంచలనానికి తెరలేపాలనుకుంటున్నారు. చైనా తో గొడవ కారణంగా ఆదేశ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇష్టపడడం లేదు.
ప్రభుత్వం కూడా దేశీయ మొబైళ్ల తయారీకి ప్రోత్సహిస్తోంది. ఈ పరిస్థితులను క్యాష్ చేసుకుని మొబైళ్ల తయారీలోనూ దూసుకుపోవాలని అంబానీ స్కెచ్ వేస్తున్నారు. గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో నడిచే స్మార్ట్ ఫోన్ తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం భారత్లో మొబైళ్ల తయారీ దారులతో అంబానీ చర్చిస్తున్నారు. ఇప్పటికే మొబైళ్లు తయారు చేసే సంస్థలను కలుపుకొని చౌక ధరకే స్మార్ట్ ఫోన్ తయారీకి జియో రంగం సిద్ధం చేస్తోంది. జియో మొబైల్స్ మార్కెట్ లోకి వస్తే అవి ఎంత సంచలనం సృష్టిస్తాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.