బాబుదేమీ లేదంట.. అంతా లోకేశ్ ఇష్టమేనట
మొన్నా మధ్య జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల తీరు మీదా.. పార్టీ నేతల తీరు మీదా అసంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. పనిలో పనిగా తన రాజకీయ వారసుడైన లోకేశ్ విషయంలోనూ తాను అసంతృప్తిగా ఉన్నట్లుగా చెప్పి అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీ విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని.. పార్టీకి నష్టం వాటిల్లితే తాను చూస్తూ ఉండిపోనని చెప్పటం తెలిసిందే. పార్టీ సభ్యత్వ నమోదు ఇష్యూతో పాటు.. గతంలో మాదిరి లోకేశ్ కు ఏదైనా చెప్పిన వెంటనే చేయటం లేదంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా అదే లోకేశ్ ఉద్దేశించి తాజాగా చంద్రబాబు చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. జూబ్లిహిల్స్ లోని చంద్రబాబు పాత ఇంటిని ఆ మధ్య కూల్చేసి.. కొత్తగా కట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన పార్టీ సమావేశం సందర్భంగా అధినేతబాబుతో ముచ్చటిస్తున్న టీటీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి.. ఇంటి పని పూర్తి అవుతుంది కదా? గృహప్రవేశం ఎప్పుడు సార్? అని ప్రశ్నించారు.
దీనికి బదులిచ్చిన చంద్రబాబు.. ‘నాదేముంది? అంతా లోకేశ్ ఇష్టం. లోకేశ్ ఎప్పుడు రమ్మంటే.. అప్పుడు వచ్చి నిల్చోవటమే నా పని. అంతకు మించి చేసేదేముంది. చేయాల్సిందేముంది?’ అంటూ నవ్వుతూ బదులిచ్చారట. పార్టీ విషయంలో బాబు ఎంత నిక్కచ్చిగా ఉంటారో..ఇంటి విషయాల్లో మాత్రం ‘పవర్’ మొత్తాన్ని కొడుక్కి అప్పగించేసినట్లుగా ఉంది కదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కొత్త ఇంటి గృహప్రవేశం దసరా రోజున ఉండే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ఎంత భారీగా చేపడతారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/