మోడీకి బాబు గ్రీటింగ్స్ కూడా చెప్పలేదా?

Update: 2018-01-02 02:30 GMT
ఏపీ ప్రభుత్వం తరఫున... న్యూ ఇయర్ అనగా జనవరి 1వ తేదీ కాదని... మన రాష్ట్రానికి ఉగాది అనబడు మరొక న్యూ ఇయర్ ఉన్నది గనుక.. ఆ రోజున వేడుకలు చేసుకోవాలే తప్ప.. ఇప్పుడు ఎవ్వరూ ఎలాంటి వేడుకలు చేసుకోవద్దు అని.. అధికారిక ఉత్తర్వులు వెలువడి ఉండవచ్చు గాక.. కానీ.. చంద్రబాబునాయుడు మాత్రం.. ఈరోజున అందరికీ గ్రీటింగ్స్ చెప్పేసుకుంటున్నారు. అలాగే... వీవీఐపీలకు కూడా చంద్రబాబునాయుడు స్పెషల్ గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. చంద్రబాబునాయుడు షెడ్యూలు గురించి అధికారికంగా.. సీఎంఓ నుంచి విడుదల అయ్యే... అధికారిక ప్రకటనల ప్రకారం ఆయన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు - భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు ఫోను చేసి శుభాకాంక్షలు చెప్పినట్లుగా మాత్రం ప్రకటనలు వచ్చాయి. సీఎంవో నుంచి వచ్చే అధికారిక ప్రకటనల ప్రకారం... చంద్రబాబునాయుడు - ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు చెప్పినట్లుగా మాత్రం ప్రకటన రాలేదు. వీటి క్రమాన్ని గమనించిన వారు.. ప్రధానికి చంద్రబాబు కనీసం న్యూఇయర్ గ్రీటింగ్స్ కూడా చెప్పలేదా అని అనుకుంటున్నారు.

కొన్నాళ్లుగా కేంద్రంతో చంద్రబాబునాయుడుకు ఎడం పెరుగుతున్నదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే కేంద్రం నుంచి ఏపీకి అందవలసిన సాయం విషయంలో కూడా చిన్న చూపు చూడడం ప్రారంభం అయిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవలి కాలంలో పోలవరం విషయంలో ఏమీ తేల్చకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఉండడంలోనూ, రెవెన్యూ లోటు విషయంలో కేంద్రం ఏపీ దుస్థితిని పట్టించుకోకుండా... వారి ధోరణిలో వారుండడం - అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ఇప్పటిదాకా పైసా విదిలించని నేపథ్యం.. ఇవన్నీ కలిపి ఏపీకి కేంద్రం నుంచి దక్కుతున్న ప్రాధాన్యం ఏ రకంగా పలచబడిపోతున్నదో ప్రజలకు అర్థమవుతూనే ఉన్నది. మరి సీఎంఓ నుంచి అధికారిక ప్రకటన రాలేదంటే.. మోడీకి చంద్రబాబు గ్రీటింగ్స్ కూడా చెప్పలేదా.. ఒకవేళ అది నిజమే అయితే గనుక.. ప్రజలకు ఎలాంటి సంకేతాలు అందుతున్నట్లు అని కూడా ప్రజలు సందేహిస్తున్నారు.

Tags:    

Similar News