రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్..ఆకాశంలో 6 వేల అడుగుల ఎత్తుకి ఎగిరిన మనిషి!

Update: 2020-02-21 01:30 GMT
ఒక మనిషి గాల్లో ఎగరడం అనేది దాదాపుగా అసాధ్యం. సినిమాలలో అయితే , అది సాధ్యపడవచ్చు కానీ , నిజ జీవితం లో అది  సాధ్యపడదు. శక్తిమ్యాన్, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ వంటి సినిమాలలో హీరోలు గాల్లో చెక్కర్లు కొడుతుంటే , మనం కూడా నిజంగా అలా ఎగిరితే ఎంత బాగుంటుందో అని అనుకుంటాం. అయితే, ఇప్పటివరకు సినిమాలలో మనం ఎగిరేమనిషిని చూసాం ..కానీ, ఎగిరే మనిషిని ఇప్పుడు రియల్ లైఫ్‌లో కూడా చూడగలం. అసలు అదేలా సాధ్యం అవుతుంది అని  అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీని పూర్తిగా చదవండి..

ఫ్రాన్స్‌కు చెందిన డేర్ డెవిల్.. వెనీస్ రెఫెట్ అనే వ్యక్తి ఇటీవల దుబాయ్‌ లో గగనతలంలో మరో అద్భుతాన్ని సృష్టించాడు.  జెట్ రెక్కల సాయంతో ఆకాశంలోకి ఐరన్ మ్యాన్ కంటే వేగంగా దూసుకెళ్లాడు. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ ఎగరలేనంత ఎత్తుకు ఎగిరి అందరిని ఆశ్చర్యపోయేలా చేసాడు. సుమారు 1,800 మీటర్ల (6,000 అడుగులు) ఎత్తుకు ఎగిరిన వెనీస్‌ సాహసాన్ని చూసి ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు.కార్బన్ ఫైర్ వింగ్స్ కలిగిన జెట్ ప్యాక్స్ సాయంతో వెనీస్ ఈ సాహసానికి పూనుకున్నాడు.  ఆ జెట్ ప్యాక్స్ ఏ మాత్రం విఫలమైనా కూడా ఆ వ్యక్తి  అంత ఎత్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అయితే, అవేవీ లెక్క చేయకుండా వినీస్ ఈ రికార్డును నెలకొల్పడం విశేషం. ఈ సాహసానికి వాడిన వింగ్స్  లో మొత్తం నాలుగు మినీ జెట్ ఇంజిన్స్ ని అమర్చారు. వీటి ద్వారా గంటకు 400 కిమీలు ప్రయాణించవచ్చు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఎక్స్‌పో 2020 దుబాయ్ లో మరోసారి ఈ స్టంట్‌ ను ప్రదర్శించనున్నాడు.

Similar News