ఇప్పుడు చూడకుంటే మళ్లీ కనిపించేది 8786లోనేట

Update: 2020-07-14 08:15 GMT
ఆకాశవీధిలో మరో అద్భుతం కనిపించనుంది. చాలా అరుదుగా కనిపించే తోక చుక్క ఒకటి ఇప్పుడు కనువిందు చేయనుంది. ఇప్పుడు చూడటం మిస్ అయితే.. మళ్లీ ఆరువేల ఏళ్ల తర్వాత మాత్రమే అది కనిపిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఐదు కిలోమీటర్ల వెడల్పు ఉండే తోక చుక్క నియోవైజ్ సాంకేతిక నామం సీ/2020ఎఫ్3 .

ఈ భారీ తోకచుక్క ఈ రోజు నుంచి ఇరవై రోజుల పాటు కనిపించనుంది. రోజు మొత్తంలో సూర్యాస్తమయం అయ్యాక 20 నిమిషాల పాటు వాయువ్య భాగంలో దీన్ని చూసే వీలుందని చెబుతున్నారు. ఈ నెల 22 - 23 తేదీల్లో ఈ తోకచుక్క భూమికి 103 మిలియన్ కిలోమీటర్ల  దూరంలోకి వస్తుందంటున్నారు. ఆ రోజుల్లో మరింత స్పష్టతతో చూసే వీలుంటుందని చెబుతున్నారు.

చాలా అరుదుగా కనిపించే ఈ తోకచుక్కను ఇప్పుడే చూసేయండి. ఇప్పుడు మిస్ అయితే.. వంద కాదు వెయ్యి కాదు.. ఏకంగా ఆరువేల ఏడువందల అరవై ఏళ్ల తర్వాత కనిపించే ఈ తోకచుక్కను చూసేయండి. 
Tags:    

Similar News