చిరంజీవి అలా.. పవన్ ఇలా... ఏకేసీన రాపాక !
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ..వీలుచిక్కినప్పుడల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై , అలాగే జనసైనికులపై విరుకుపడుతుంటారు. తాజాగా మరోసారి అయన పవన్ టార్గెట్ కొన్ని విమర్శలు కురిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన జనసేన ఎమ్మెల్యే రాపాక .. తాను ఇప్పటికీ జనసేన ఎమ్మెల్యేనే , కాకపోతే వైసీపీ కార్యక్రమాలు బావున్నాయి కాబట్టి అనుకూలంగా ఉన్నాను అన్నారు.
తాను 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ట్రై చేశానని కానీ ఇవ్వలేదన్నారు. జనసేనవాళ్లు తన దగ్గరకు వచ్చి పోటీ చేయమన్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జనసేన పార్టీకి అధినేత ఒక్కరే ఉన్నారు అని , కేడర్ లేదు అని తాను పార్టీ కమిటీలి వేయాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య తేడా ఉందని, చిరంజీవి అందరితో కలిసి ఉండేవారన్నారు. పవన్ మాత్రం అలా కాదని చెప్పుకొచ్చాడు. నాయకుడు ప్రజలతో మమేకమైఉండాలని , ఆలా ఉన్నందువల్లే సీఎం జగన్ ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారని చెప్పారు.
నాదెండ్ల మనోహర్ పవన్ ను రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళుతున్నానని తాను భావిస్తున్నాను అన్నారు. తన విషయంలోనే ఇది జరిగిందని, గెలిచిన తనను పక్కన పెట్టుకోకుండా నాదెండ్ల మనోహర్ ను పక్కన పెట్టుకోవడాన్ని అందరూ గమనించారన్నారు. పార్టీలో ఉన్నవాళ్లు అదే అనుకుంటున్నారన్నారు. దిండి మీటింగ్ కు తనను పిలవలేదని.. నాదెండ్ల మనోహర్ తనను ఏమన్నారో అందరికీ తెలుసన్నారు. తనతో బొట్టు పెట్టి పిలవరు కదా అన్నారని.. తర్వాత తానేకుర్చీ తెచ్చి వేసుకున్నానని గుర్తు చేశారు. అలాగే , సోషల్ మీడియాలో ఉన్నవాళ్లు ఓటు వేసి గెలిపించడానికి పనిచేయరని.. పార్టీ అభివృద్ధికి పనికిరారు, కేవలం ఇంకొకళ్లను తిట్టడానికి పనికొస్తారని జనసైనికుల్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.