ఓటుకునోటు: కొత్త ట్విస్టు

Update: 2015-09-02 06:36 GMT
తెలుగు రాష్ర్టాల మ‌ధ్య తీవ్రంగా చ‌ర్చ‌నీయాంశం అయిన ఓటుకు నోటు కేసులో మ‌రో కొత్త ట్విస్టు తెర‌మీద‌కు వ‌చ్చింది. తెలంగాణ ఏసీబీ హ‌ఠాత్తుగా ప్రారంభించిన దూకుడులో ఓ అమాయకుడు ఇరుక్కున్నాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలంలోని పాలకుర్తి గ్రామానికి చెందిన రాములు గౌడ్ దినసరి కూలీ. ఓటుకు నోటుకు వ్యవహారంలో వాడిన ఓ ఫోన్‌ నంబరును....రాములుకు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఆ కారణంతోనే అతనికి తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

అయితే ఈ విష‌య‌మై రాములు ల‌బోదిబోమంటున్నాడు. రెండేళ్ల క్రితమే తన ఫోన్ పోయిందని...ఇపుడు కొత్త నంబరును వాడుతున్నట్లు చెప్పాడు. తనకే పాపం తెలియదని...సిరిసిల్ల టెక్స్‌ టైల్‌ పార్క్‌ లో దినసరి కూలీగా పనిచేస్తున్నానని వాపోయాడు. చివరకు విచారణకు హైద్రాబాద్‌ కు విచారణకు వెళ్లాలంటే..డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. అధికారులు మాత్రం... ఈ నెల 2న ఉదయం పదిన్నర గంటలకు ఏసీబీ ముందు హాజరుకావాలని నోటీసులివ్వ‌డం విచిత్రం.

టీ ఎసీబీ చేసిన ప‌నితో తెలంగాణ రాష్ర్టానికి చెందిన వ్య‌క్తి, అది కూడా ఓ సామాన్యుడు బ‌లికావ‌డం బాధాక‌రం.  అస‌లేమీ తెలియ‌ని సామాన్యుడిని కూడా రాజ‌కీయ కుట్ర‌లో లాగి చిక్కుల్లో ప‌డేయ‌టం...నిజంగా బాధాక‌ర‌మే.
Tags:    

Similar News