మరీ.. అంత పబ్లిక్ గా చెప్పుతో కొడతానంటే ఎలా కాపు రామచంద్రారెడ్డి?

Update: 2023-06-01 10:01 GMT
ప్రజా జీవితంలో ఉన్న వారికి పొగడ్తలు కంటే తెగడ్తలే ఎక్కువగా ఉంటాయి. నాలుగు మంచి పనులు చేసినా..  పూర్తి చేయాల్సిన పనులు నలభై ఉంటాయి. అందుకే కాస్తంత ఓపిక .. సహనం చాలా అవసరం. మరి.. అలాంటి బ్యాలెన్సును మిస్ కావటం ద్వారా వార్తల్లోకి వచ్చారు ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.

జనాల మధ్యలోకి వెళ్లినప్పుడు బ్యాలెన్స్ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు భిన్నంగా వ్యవహరించిన వైనం హాట్ టాపిక్గా మారింది. తాజాగా అనంతపురం జిల్లా గోవిందవాడలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని నిర్వహించటం తెలిసిందే.

ఈ సందర్భంగా అక్కడి వారు పలు సమస్యల్ని చీప్ విప్ సాబ్ ముందుంచారు. తమ కాలనీలో ప్రతి నెలా రేషన్ ఇవ్వటం లేదని.. ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదని.. పక్కా ఇళ్లు మంజూరు చేయలేదంటూ సమస్యల చిట్టా విప్పారు. దీంతో పాటు.. ఏళ్ల తరబడి ఉన్న పశువుల పాకను నేతలు ఆక్రమించుకున్నారంటూ ఎమ్మెల్యే ఎదుట గ్రామస్తులు గళం విప్పటంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.

నిజానికి దీన్నో అవకాశంగా మార్చుకొని.. సంబంధిత అధికారుల తాట తీసే ప్రోగ్రాం ను వదిలేసి కాపు రామచంద్రారెడ్డి.. తాను వస్తే ఇన్ని సమస్యలతో స్వాగతం పలుకుతారా? అన్న కోపాన్ని ప్రదర్శించారు. నాలుగేళ్లలో డెవలప్ మెంట్ ఏమీ చేయలేదన్న గ్రామస్థుల మాటలకు ఆగ్రహానికి గురైన రామచంద్రారెడ్డి బ్యాలెన్స మిస్ అయి.. సమస్యలకు పరిష్కారం అడిగితే చెప్పుతో కొడతానంటూ తిట్టేశారు.

దీంతో.. గ్రామస్తులు అవాక్కు అయిన పరిస్థితి. ఇది సరిపోనట్లు.. చీప్ విప్ పక్కనే ఉన్న పోలీసు కల్పించుకొని.. అనవసరంగా రచ్చ చేస్తే కేసులు నమోదు చేస్తానని చెప్పటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాపు కాస్తంత కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Similar News