వైసీపీకి బీజేపీ డిస్టెన్సు... రీజ‌న్ ఇదే... !

వైసీపీ భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌లు ఏంటి? ఆ పార్టీ ఎలా పుంజుకుంటుంది? ఏ విధంగా రాజ‌కీయంగా అడుగులు వేస్తుంది? ఈ ప్ర‌శ్న‌లు.. ఎవ‌రో కాదు.. బీజేపీ పెద్ద‌లే ఆరా తీసిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం.;

Update: 2025-12-14 06:30 GMT

వైసీపీ భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌లు ఏంటి? ఆ పార్టీ ఎలా పుంజుకుంటుంది? ఏ విధంగా రాజ‌కీయంగా అడుగులు వేస్తుంది? ఈ ప్ర‌శ్న‌లు.. ఎవ‌రో కాదు.. బీజేపీ పెద్ద‌లే ఆరా తీసిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల గురించి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇటీవ‌ల ఎంపీల‌తో చ‌ర్చించారు. అయితే. కేవ‌లం ఆయ‌న కూట‌మి, బీజేపీల రాజ‌కీయాల గురించే కాకుండా.. వైసీపీ రాజ‌కీయాల గురించిన కూడా ఆరా తీసిన‌ట్టు తెలిసింది. ఆ పార్టీ ఏ విధంగా ఉంది? ఏం చేస్తోంది? అనే విష‌యాల‌పై బీజేపీ దృష్టి పెట్టింది.

నిజానికి బీజేపీ కూట‌ముల విష‌యంలో అనుస‌రించే వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఏ రాష్ట్రంలో అయి నా.. ఏ పార్టీతోనూ నిక‌రంగా క‌లిసి ఉండే ప‌రిస్థితి బీజేపీకి లేదు. 2024 ఎన్నిక‌ల‌కు ముందు.. కూడా ఏపీలో ఇలాంటి సందిగ్ధ‌త క‌నిపించింది. కూట‌మిక‌ట్టినా.టీడీపీ విష‌యంలో ఆచి తూచి అడుగులు వేశారు. అం దుకే సూప‌ర్ సిక్స్ మేనిఫెస్టో ప్ర‌క‌ట‌న స‌మ‌యంలో బీజేపీ నాయ‌కులు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ప్ర‌చారం కూడా చేయ‌లేదు. ఇటీవ‌ల కొన్ని నెల‌లుగా మాత్ర‌మే సూప‌ర్ సిక్స్ గురించి చెబుతున్నారు.

సో.. బీజేపీ ఎక్క‌డైనా అలానే ఉంటుంది. ఏ పార్టీనీ దూరం చేసుకుని.. రాజ‌కీయాలు చేయ‌దు. త‌ద్వారా.. తాను ఎదిగేందుకు ప్రాధాన్యం ఇస్తుంది. అలానే ఏపీలోనూ `సావ‌కాశాలు` చూసుకుంటుంది. అయితే.. టీడీపీ.. లేక‌పోతే.. వైసీపీతో ప‌రోక్షంగా క‌లిసి రాజ‌కీయాలు చేసిన సంస్కృతి కూడా ఉంది. ఈ నేప‌థ్యం లోనే వైసీపీ ప‌రిస్థితిని తెలుసుకున్న బీజేపీ పెద్ద‌లు.. ప్ర‌స్తుత కూట‌మికే మొగ్గు చూపారు. వైసీపీ ప‌రిస్థితిలో మార్పులేద‌ని, రాలేద‌ని తెలుసుకున్న త‌ర్వాత‌.. కూట‌మికి బ‌లంగా ఉండాల‌ని నిర్ణ‌యించారు.

ఆది నుంచి వైసీపీని జ‌గ‌న్ న‌డిపిస్తున్నా.. ఆయ‌న స‌ల‌హాదారుల‌పైనా.. ఐప్యాక్ వంటి వ్యూహాత్మ‌క రాజ‌కీ యాలు చేసే వారిపైనే ఆధార‌ప‌డుతూ వ‌చ్చింది. ఇది మంచి చెడుల మిశ్ర‌మంగా ఉంది. పైగా.. సిద్ధాంతం అంటూ.. ప్ర‌త్యేకంగా ఏమీ లేదు. ఇప్పుడు కూడా పార్టీ ప‌రిస్థితి అలానే ఉంది. దీనిని గ‌మ‌నించే బీజేపీ కీల‌క స్టాండు తీసుకుంది. ఇక‌,ఇప్పుడున్న ప‌రిస్థితిలోనూ అదే త‌ర‌హా రాజ‌కీయాలు చేసేందుకు వైసీపీ మొగ్గు చూపుతోంది. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ల కోసం వెతుకుతున్న‌ట్టు తెలిసింది. అందుకే.. బీజేపీడిస్టెన్సు పాటిస్తోంది.

Tags:    

Similar News