కేరళలో కొత్త చరిత్ర.. తొలిసారి ఆ కార్పొరేషన్లో కాషాయ జెండా
తాజాగా జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో 101 వార్డులకు 50స్థానాల్ని దక్కించుకోవటం ద్వారా తొలిసారి కేరళలోని ఒక కార్పొరేషన్ ను సొంతం చేసుకోవటమే కాదు.. కాషాయ జెండా రెపరెపలాడేలా చేసిందని చెప్పాలి.;
అవును.. బీజేపీ కొత్త చరిత్రను క్రియేట్ చేసింది. ఎంత ప్రయత్నించినా.. తన ఉనికిని చాటుకునేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని కేరళలో కాషాయ జెండా సగర్వంగా ఎగిరిన తొలి సందర్భంగా దీన్ని చెప్పాలి. కేరళలో దాదాపు45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయంలో బీజేపీ తొలిసారి భారీ విజయాన్ని నమోదు చేయటమే కాదు.. కొత్త రాజకీయం షురూ అయ్యిందన్న సంకేతాన్ని పంపినట్లుగా చెప్పాలి.
తాజాగా జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో 101 వార్డులకు 50స్థానాల్ని దక్కించుకోవటం ద్వారా తొలిసారి కేరళలోని ఒక కార్పొరేషన్ ను సొంతం చేసుకోవటమే కాదు.. కాషాయ జెండా రెపరెపలాడేలా చేసిందని చెప్పాలి. ఆసక్తికర అంశం ఏమంటే.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం ఎంపీ స్థానంలోనిదే ఈ కార్పొరేషన్ కావటం గమనార్హం.
అధికార కూటమి లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు ఈ ఎన్నికల్లో ప్రజలు భారీ ఓటమి ఎదురుకావటం విశేషం. వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. బీజేపీ సాధించిన తాజా విజయం కాషాయ క్యాడర్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పాలి. తిరువనంతపురం కార్పొరేషన్ లో ఎన్డీయే కూటమి అనూహ్య రీతిలో 50 వార్డుల్లో విజయాన్ని నమోదు చేయటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అసెంబ్లీ స్థానాన్ని.. సుమారు రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. తాజాగా తిరువనంతపురం నగర కార్పొరేషన్ లో పాగా వేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా వెల్లడైన కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే 50 స్థానాల్లో విజయం సాధించగా.. ఎల్ డీఎఫ్ 29 స్థానాల్లో యూడీఎఫ్ 19 వార్డులకే పరిమితమైంది. అత్యధిక స్థానాన్ని సొంతం చేసుకున్న ఎన్డీయే కూటమి చేతికి కార్పొరేషన్ పగ్గాలు అందనున్నాయి. రెండు వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు ఎర్నాకుళం కార్పొరేషన్ ను సైతం ఎన్డీయే కూటమి సొంతం చేసుకోవటం చూస్తే.. కేరళలో కాషాయ జోరు మొదలైనట్లుగా చెబుతున్నారు.