మాజీ మంత్రుల గ్రాఫ్ ఇదేనా ..!
మాజీమంత్రులు చాలా మంది గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. వీరిలో ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్గా ఉండగా మిగిలిన వారంతా సైలెంట్ గా ఉంటున్నారు.;
మాజీమంత్రులు చాలా మంది గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. వీరిలో ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్గా ఉండగా మిగిలిన వారంతా సైలెంట్ గా ఉంటున్నారు. ఇటు పార్టీ పరంగా ,అటు ప్రభుత్వం పరంగా కూడా దూకుడు అయితే ప్రదర్శించడం లేదు. ఉదాహరణకు పెద్దాపురం నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ మంత్రి చినరాజప్ప ఎక్కడా కనిపించడం లేదు. గతంలో ఆయన హోం శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం చంద్రబాబు హయాంలో కూడా మంత్రి పదవి వస్తుంది అనుకున్నా ఆయనకు ఆశలు తీరలేదు. దీంతో ఆయన సైలెంట్ అయిపోయారు.
అదేవిధంగా ఆచంట నుంచి గెలిచిన పితాని సత్యనారాయణ మాజీమంత్రి. గతంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. కానీ ఆయన కూడా ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. దూకుడు అయితే ప్రదర్శించడం లేదు. అసలు నియోజకవర్గం గురించి కూడా పట్టించుకోవడం లేదన్న వాదన కూడా వినిపిస్తుంది. ఇక, చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం నుంచి గెలిచిన ఎన్. అమరనాథ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈయన కూడా గతంలో వైసీపీ నుంచి టీడీపీ లోకి వచ్చారు. మంత్రి పదవిని దక్కించుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.
కానీ ఆ ఆశలు కూడా నెరవేరలేదు. దీంతో అమర్నాథ్ రెడ్డి కూడా సైలెంట్ గా ఉన్నారు. ఇక రాప్తాడు నుంచి విజయం దక్కించుకున్న పరిటాల సునీత గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం చంద్రబాబు టీం లో చోటు దక్కుతుందని ఆశ పెట్టుకున్నారు. కానీ ఆమెకు కూడా చంద్రబాబు అవకాశం కల్పించలేదు. అయితే ఇది ప్రస్తుత పరిణామాలపై ప్రభావం చూపిస్తోంది. ఆవిడ కూడా ప్రజల్లోకి రాలేకపోతున్నారు. యాక్టివ్ గా ఉండడం లేదు. దీనికి అనారోగ్య కారణాలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన రాయదుర్గం ఎమ్మెల్యే కల్వ శ్రీనివాసులు కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వాస్తవానికి మాజీ మంత్రులు ఉన్న నియోజకవర్గంలో పెద్దగా రాజకీయ దూకుడు గాని ప్రభుత్వంపరంగా సంక్షేమ పథకాల అమలు తీరు విషయంలో కానీ వెనకబడ్డారు అన్నది వాస్తవం. ఆయా విషయాలపై సీఎం చంద్రబాబు ఒకింత అసహనంతో ఉన్నారు. ఈ పరిస్థితి మంచిది కాదని కూడా చెబుతున్నారు.
మరి నాయకులు మారతారా లేకపోతే గతంలో తమకు పదవులు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వలేదన్న ఆవేదంలోనే ఉంటారా అనేది చూడాలి. ఏదేమైనా మాజీ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న చాలా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరులను సమీక్షించే వాళ్ళు కనిపించడం లేదన్నది వాస్తవం.