వెళ్లిపోండి: చైనా రక్షణమంత్రికి తేల్చిచెప్పిన రాజ్ నాథ్ సింగ్
సరిహద్దుల్లో తీవ్రఉద్రిక్తతల నెలకొన్న సమయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి విఫెంఘీలు మాస్కోలో 2 గంటల 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. మే నెలలో అంతకుముందు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపించింది. ఆ తర్వాత ఇలాంటి అత్యున్నతస్థాయి భేటీ ఇదే మొదటిసారి. షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఇరుదేశాల రక్షణ మంత్రులు వచ్చారు. జూన్ మిడిల్‌లో గాల్వాన్ లోయలో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో 20 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు ఎంతమంది చనిపోయారనే విషయం వెల్లడించలేదు. కానీ ప్రాణనష్టం అంతకంటే ఎక్కువగా జరిగినట్లు వార్తలు వచ్చాయి.
ఈ భేటీలో నిన్న గాల్వాన్, ఇప్పుడు పోంగాంగ్ లేక్ సమీపంలో చైనా దుందుడుకు చర్యలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లుగా అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఘర్షణలకు ముందు ఉన్న పరిస్థితిని వెంటనే పునరుద్ధరించాలని చైనాకు భారత్ తేల్చి చెప్పింది. బలగాలను ఉపసంహరించుకోవాలని తెలిపింది. అంతకుముందు రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు పరిరక్షించుకోవాలంటే దురుసుతనాన్ని వీడాలని చైనాకు పరోక్షంగా చురకలు అంటించారు. ఒక దేశం మరో దేశంపై ప్రదర్శించిన దురుసుతనం వల్ల అందరూ నష్టపోవడాన్ని రెండో ప్రపంచ యుద్ధం కళ్లకు కట్టిందన్నారు.
కాగా, తూర్పు లఢాక్‌లో చైనా సైనికులను అంతకంతకూ మోహరిస్తోంది. సౌత్ పోంగాంగ్ ప్రాంతంలో అదనంగా ట్యాంకులు, సైన్యాన్ని ఉంచింది. అయితే పోంగోంగ్ లేక్ నార్త్, సౌత్ రేవుల్లోని వ్యూహాత్మక పర్వత శిఖరాలను భారత్ ఇటీవల స్వాధీనం చేసుకుంది. డ్రాగన్ ట్యాంకు బలగాలను ఉంచింది. అయితే థాకుంగ్ నుండి ముక్‌పారి వెలువలి వరకు ఎత్తైన ప్రాంతాల వద్ద మన బలగాలు మోహరించి, చైనా కదలికలను పసిగడుతున్నాయి. మొత్తం మీద పోంగాంగ్ ప్రాంతంలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. కీలకమైన బ్లాక్ టాప్, హెల్మెట్ ప్రాంతాలు చైనా ఆదీనంలో ఉన్నప్పటికీ, వీటి పాదాల చెంత భారత బలగాలు కాపుకాస్తున్నాయి. పోంగాంగ్‌లో భారత్ ఆధిపత్యం కనిపిస్తోంది.