కేంద్ర ఎన్నికల కమిషనర్‌ గా రాజీవ్‌ కుమార్‌!

Update: 2020-08-22 08:10 GMT
ఆసక్తికర నియామకాన్ని చేపట్టారు. ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషర్ గా పని చేసే అశోక్ లావాసా.. తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ఎన్నికల సంఘం కమిషనర్ గా కీలక బాధ్యతలు వహించే ఆయన.. ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ గా అవకాశం రావటంతో తన పదవికి రాజీనామా చేసేశారు.దీంతో..  ఆ స్థానం ఖాళీ అయ్యింది. తాజాగా ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల సంఘంలో ముగ్గురు కమిషనర్లు ఉంటారు. వారిలో ఒకరు ప్రధాన కమిషనర్ గా వ్యవహరిస్తుంటారు.కీలక నిర్ణయాలకు.. మూడింట రెండు ఓట్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. తాజాగా లావాసా ఖాళీ స్థానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి.. రిటైర్డు ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్రపతి కీలక నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్ కేటర్ కు చెందిన ఈ 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.. మోడీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

మూడు దశాబ్దాలుగా పబ్లిక్ పాలసీల విషయంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. పబ్లిక్ పాలసీ అండ్ సస్టెయినబిలిటీలో మాస్టర్స్ చేసిన ఆయన.. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా గత జులైలో నియమితులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన  ప్రధానమంత్రి జనధన్ యోజన.. ముద్రా లోక్ స్కీమ్స్ లో కీలక భూమిక పోషించి.. తన సత్తా చాటారని చెప్పాలి.

తక్కువ వ్యవధిలో కోట్లాది జనధన్ యోజన ఖాతాల్ని తెరవటమనే మేజిక్ ను విజయవంతంగా పూర్తి చేశారు. రిటైర్ అయ్యాక కూడా ఖాళీగా లేరు. కేవలం నెల వ్యవధిలోనే పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ఛైర్ పర్సన్ గా ఎంపికయ్యారు. ఈ పదవిలో ఉన్న వారు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ పరైజెస్ లో అత్యున్నత స్థాయి నియామకాల్ని ఈ సంస్థే చూస్తుంటుంది. ఆ స్థానం నుంచి కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Tags:    

Similar News