ఆర్ ఎస్ ఎస్ కేసు: కోర్టుకు రాహుల్ గాంధీ..

Update: 2018-06-12 08:52 GMT
రాహుల్ గాంధీ ఈరోజు మరోసారి మహారాష్ట్రలోని భీవండి కోర్టుకు హాజరయ్యాడు. 2014 మార్చి 6న సార్వత్రిక ఎన్నికల సమయంలో మహాత్మాగాంధీ హత్యలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్)కు సంబంధం ఉందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఆర్ ఎస్ ఎస్ మండిపడింది. అతడిపై మహారాష్ట్రలోని భీవండిలో ఆర్ ఎస్ ఎస్ నాయకులు పరువు నష్టం కేసు పెట్టారు. రాజేశ్ ఖుంతే అనే స్థానిక ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఆర్ ఎస్ ఎస్ కూడా రాహుల్ తమ సంస్థపై నిరాధార ఆరోపణలు చేశాడని మండిపడింది.

దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో రాహుల్ ను జూన్ 12వ తేదీన తమ ముందు హాజరుకావాలని భీవండి కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం రాహుల్ ముంబై విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా భీవండి కోర్టు ముందు హాజరయ్యారు.
Tags:    

Similar News