రాహుల్ గాంధీకి అక్కడ జయజయధ్వానాలు!

Update: 2019-06-08 01:30 GMT
ఒకవైపు దేశమంతా కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడినా కేరళలో మాత్రం ఆ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది.  ఇరవై ఎంపీ సీట్లున్న ఆ రాష్ట్రంలో పంతొమ్మిది ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. తద్వారా అక్కడ  కాంగ్రెస్ పార్టీ తన సత్తా చూపింది. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా వచ్చిన ఎంపీ సీట్లు యాభై రెండు కాగా.. అందులో కేరళ వాటా పంతొమ్మిదిగా ఉంది!

ఇక ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ని కేరళ లోని వయనాడ్ నియోజకవర్గం భారీ మెజారిటీతో గెలిపించింది. భారీ మెజారిటీని  ఇచ్చి రాహుల్ ను ఎంపీగా చేసింది వయనాడ్. ఈ నేపథ్యంలో ఎంపీగా నెగ్గిన తర్వాత తొలి సారి కేరళ పర్యటనకు వెళ్లారు రాహుల్ గాంధీ.

తనకు, తమ పార్టీకి భారీ మెజారిటీని ఇచ్చిన కేరళ ప్రజలకు  కృతజ్ఞతలు తెలిపేందుకు రాహుల్ వెళ్లాడు. ఈ సందర్భంగా కేరళలోని పలు నగరాల్లో రాహుల్ ర్యాలీలు నిర్వహించాడు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ కు భారీ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేశారు. రాహుల్ కు జయజయధ్వానాలు పలికారు. రాహుల్ కు తాము ఉన్నామంటూ, తాము రాహుల్ తో ఉన్నామంటూ అక్కడి ప్రజలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేతకు ధైర్యం చెప్పారు. మరి కేరళ ఇచ్చిన ఊరటతో అయినా రాహుల్ గాంధీ తిరిగి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని పని చేస్తారా?

Tags:    

Similar News