జపాన్ లోనూ ట్రంప్ ప్రభావం పనిచేసిందా.. తకాయిచీ సూపర్ విక్టరీ!

అవును... జపాన్ లో ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశ ప్రధానమంత్రి సనే తకాయిచీ నేతృత్వంలోని తన పాలక సంకీర్ణం అఖండ విజయం సాధించింది.;

Update: 2026-02-09 10:30 GMT

జపాన్ లో ఓ చారిత్రక సంఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... 64 ఏళ్ల సనా తకాయిచీ తన పార్టీలో నాయకత్వ రేసులో గెలిచి, పార్లమెంటులో తగిన మద్దతు పొంది, అక్టోబర్ లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆ దేశంలో మొదటి మహిళా ప్రధానిగా ఆమె నిలిచారు. అయితే.. ప్రజా ఆమోదం కోసం ఆమె ఎన్నికలకు పిలుపునిచ్చారు! ఈ సమయంలో ఆమె సూపర్ విక్టరీ సాధించారు.. ఈ సందర్భంగా ఆమెకు ట్రంప్ ఇచ్చిన మద్దతు తెరపైకి వచ్చింది.

అవును... జపాన్ లో ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశ ప్రధానమంత్రి సనే తకాయిచీ నేతృత్వంలోని తన పాలక సంకీర్ణం అఖండ విజయం సాధించింది. ఓట్ల లెక్కింపుల ప్రకారం సోమవారం తకాయిచీకి చెందిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి 316 సీట్లు లభించాయి. వాస్తవానికి 465 మంది సభ్యులున్న జపాన్ దిగువ సభలో మ్యాజిక్ ఫిగర్ 261 కాగా... 316 సీట్లలో ఆమె పార్టీకి విజయం దక్కింది. దీంతో.. ఇది చారిత్రక విజయం అని అంటున్నారు!

అందుకు ఓ బలమైన కారణం ఉంది. 1995లో ఈ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పడినప్పటి నుంచీ ఆ పార్టీకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని అంటున్నారు. అంతకంటే ముందు 1986లో ఈ పార్టీ 300 సీట్లు దక్కించుకోగా.. తాజా ఫలితాలు ఆ రికార్డును బద్దలు కొట్టాయి!

డొనాల్డ్ ట్రంప్ అభినందనలు!:

జపాన్ ప్రధాన మంత్రి తకాయిచీ పాలక సంకీర్ణం ఘన విజయం సాధించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్ద్ ట్రంప్ స్పందిస్తూ.. ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా... ‘మిమ్మల్ని సమర్థించడం నాకు గౌరవం’ అని చెప్పిన ట్రంప్.. ఆమెను అత్యంత గౌరవనీయమైన, చాలా ప్రజాదరణ కలిగిన నాయకురాలు అని పిలిచారు. ఎన్నికలకు పిలుపునిచ్చేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమైనదే కాదు.. తెలివైనది కూడా అని చెబుతూ అవే ఇప్పుడు గొప్ప ఫలితాన్నిచ్చిందని అన్నారు.

కాగా... ఆదివారం ఈ ఎన్నికలు జరగడానికి ముందే తకాయిచీకి ట్రంప్ బహిరంగ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తకాయిచీ చాలా తెలివైన, శక్తివంతమైన నాయకురాలని ఇప్పటికే నిరూపించుకున్నారని.. ఆమె తన దేశాన్ని నిజంగా ప్రేమించే వ్యక్తి అని.. ఆమె జపాన్ ప్రజలను నిరాశపరిచారని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఇటీవల.. అర్జెంటీనాకు చెందిన జేవియర్ మిలీ, హంగేరీకి చెందిన విక్టర్ ఓర్బన్ లను సమర్థించిన తర్వాత ట్రంప్ విదేశీ ఎన్నికల్లో అభ్యర్థులకు బహిరంగంగా మద్దతు తకాయిచీకి ఇచ్చారు! మరోవైపు ఆమెను మార్చి 19న వైట్ హౌస్ కు ఆహ్వానిస్తానని ట్రంప్ వెల్లడించారు.

Tags:    

Similar News