ఆన్ లైన్ గేమ్స్ ఎంత ఒత్తిడి కలిగిస్తాయో చెప్పే షాకింగ్ సంఘటన ఇది!

వివరాళ్లోకి వెళ్తే... మీరట్ లోని ఖైర్ నగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ ఫరూఖ్ కుమారుడు మహ్మద్ కైఫ్ (22) తన తండ్రికి వ్యాపారంలో సాయపడుతుండేవాడు.;

Update: 2026-02-09 07:09 GMT

ఈ ప్రపంచంలోకి సెల్ ఫోన్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాలలు, యువత ఆన్ లైన్ గేమ్ కి బానిసలవుతున్నారనే చర్చ బలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. పైగా తల్లి తండ్రులు వారి బిజీల్లో వారుండటంతో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేకపోతున్నారని.. ప్రైవసీ మాటున వారి సెల్ ఫోన్ లపై నిఘా ఉంచలేకపోతున్నారని అంటున్నారు! ఈ క్రమంలో ఆన్ లైన్ గేమ్స్ బారిన పడి ఎంతో మంది తమ జీవితాలు నాశనం చేసుకుంటుండగా.. తాజాగా ఓ యువకుడి మెదడు నరాలు చిట్లిన ఘటన తెరపైకి వచ్చింది.

అవును.. ఒకప్పుడు వినోదానికి మాత్రమే పరిమితమయ్యాయని చెప్పే ఆన్ లైన్ గేమ్ లు ఇప్పుడు యువత ప్రాణాలను బలితీసుకుంటున్న పరిస్థితి. ఆ గేమ్స్ వీరిలో తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాయని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గేమ్ లో గెలవాలనే తీవ్ర ఒత్తిడిలోకి వీరు కాలక్రమేణా నెట్టబడతారని.. ఫలితంగా కొంతమందికి వారి మానసిక ఆరోగ్యం దెబ్బ తింటే.. మరికొంతమందికి ఏకంగా ప్రాణాలే పోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అలాంటి ఘటన తాజాగా మీరట్ లో వెలుగు చూసింది!

వివరాళ్లోకి వెళ్తే... మీరట్ లోని ఖైర్ నగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ ఫరూఖ్ కుమారుడు మహ్మద్ కైఫ్ (22) తన తండ్రికి వ్యాపారంలో సాయపడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆఫీసులో కూర్చుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, మొబైల్ ఫోన్ లో పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడు తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టబడటంతో అకస్మాత్తుగా సృహ తప్పి పడిపోయాడు. దీంతో.. అది గమనించినవారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

ఆ సమయంలో అతడి బీపీ 300 దాటినట్లు వైద్యులు గుర్తించారని అంటున్నారు. పరిస్థితి విషమించడంతో కైఫ్ ను ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో సుమారూ రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన కైఫ్.. ఆదివారం కన్నుమూశాడు. ఈ సందర్భంగా స్పందించిన వైద్యులు... అధిక రక్తపోటు కారణమా మెదడులోని రక్తనాళాలు చిట్లి, అంతర్గత రక్తస్రావం జరిగిందని.. అందువల్లే అతడు మరణించాడని తెలిపారు. దీంతో.. ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది!

Tags:    

Similar News