రూ.10 కోట్ల కారు ఢీకొట్టింది.. బుల్లెట్ రైడర్ ను 10 అడుగులు గాల్లోకి ఎగరేసింది!

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోని వీఐపీ రోడ్డులో ఓ లంబోర్గిని కారు పాదచారులను, అనేక వాహనాలను ఢీకొట్టింది. ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ సంఘటనలో సుమారు ఆరుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.;

Update: 2026-02-09 08:28 GMT

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోని వీఐపీ రోడ్డులో ఓ లంబోర్గిని కారు పాదచారులను, అనేక వాహనాలను ఢీకొట్టింది. ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ సంఘటనలో సుమారు ఆరుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అనంతరం ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రమాదం జరిగిన సమయంలో వాహనం నడుపుతున్న పొగాకు వ్యాపారవేత్త కేకే మిశ్రా కుమారుడు శివం మద్యం మత్తులో ఉన్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి!

అవును... లంబోర్గిన రెవెల్టో అనే సుమారు 10 కోట్ల రూపాయలు విలువ చేసే లగ్జరీ కారు.. రెవ్-3 మాల్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 3:15 గంటల ప్రాంతంలో రోడ్డుపై బీభత్సం సృష్టించింది. ఈ సమయలో శివం మిశ్రా అనే వ్యక్తి నడుపుతున్న ఈ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తులు, పాదచారులపైకి, అనేక వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం... వేగంగా దూసుకొచ్చిన కారు తొలుత ఓ ఆటో రిక్షాను ఢీకొట్టి.. ఆ తర్వాత ఆగి ఉన్న రాయల్ ఎన్ ఫిల్డ్ బుల్లెట్ ను ఢీకొట్టింది.. దీంతో దాని రైడర్ సుమారు 10 అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరిపడ్డాడు! ఈ క్రమంలో ఆ బుల్లెట్ ముందు చక్రాన్ని ఎక్కించిన కారు, కొంతదూరం లాగి, కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఇదే క్రమంలో.. గాయపడిన వ్యక్తిని అనేక మీటరు దూరం విసిరేసింది!

అయితే... ఈ స్థాయిలో బీభత్సం సృష్టించిన తర్వాత శివం ఘటనా స్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడని.. ఆ సమయంలో మరో కారులో అతన్ని అనుసరిస్తున్న బౌన్సర్లు అతడిని కాపాడటానికి ప్రయత్నించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. కోపంతో ఉన్న పాదచారులు లబోర్గిని కారు అద్దాలను పగలగొట్టి మిశ్రాను బయటకు లాగారని అంటున్నారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ సమయంలో ఆగ్రహంతో ఉన్న ప్రజల నుంచి శివంను రక్షించి అతనితో పాటు ఆ ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. గుమిగూడిన జనసమూహాన్ని క్లియర్ చేశారు. అనంతరం ప్రమాదానికి కారణమైన ఆ కారును స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News